Best Mango Plants : రైతులకు అందుబాటులో మేలైన మామిడి మొక్కలు

Best Mango Plants : పండ్లతోటలను నాటిన 3 నుండి 4 సంవత్సరాల తర్వాతగాని వాటి దిగుబడి సామర్ధ్యాన్ని అంచనా వేయలేం. తీరా నాటింది నాశిరకం మొక్కైతే.. పడిన శ్రమంతా వృధా అవుతుంది.

Best Mango Plants : పండ్లతోటలనుంచి రైతులు పదికాలాలపాటు మంచి ఫలసాయం పొందాలంటే సారవంతమైన నేలల ఎంపికతోపాటు, ఆయా ప్రాంతాల డిమాండ్ కు అనుగుణంగా రకాలను ఎంపికచేసుకోవాలి. నేడు అనేక పండ్ల మొక్కల నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి ప్రలోభాలకు లొంగకుండా రైతులు నమ్మకమైన నర్సరీల నుండి మొక్కలను కొనుగోలుచేయాలి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ఎందుకంటే.. పండ్లతోటలను నాటిన 3 నుండి 4 సంవత్సరాల తర్వాతగాని వాటి దిగుబడి సామర్ధ్యాన్ని అంచనా వేయలేం. తీరా నాటింది నాశిరకం మొక్కైతే.. పడిన శ్రమంతా వృధా అవుతుంది. పెట్టిన పెట్టుబడంతా బూడిదలోపోసిన పన్నీరవుతుంది. అందువల్ల కొత్తగా మామిడి తోటలు సాగు చేసే రైతాంగం నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు ఉద్యానశాఖ అధికారులు.

పదికాలాలపాటు దిగుబడినిచ్చే పంట మామిడి. మామిడికి పుట్టినిల్లు మనదేశమే. అత్యంత వైవిధ్యభరిత జన్యు సంపదా మన సొంతం. అయినా ఇతర దేశాలు మనకన్నా 50 శాతం మిన్నగా అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. సంప్రదాయ సాగు పద్ధతులు ఇంకా వేళ్లూనుకుని వుండటం, నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేకపోవటం దీనికి ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి.

మామిడి మొక్కదశలో దాని దిగుబడిని అంచనా వేయటం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. ఇవన్ని తెలియజేసేందుకు సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, ములుగు గ్రామంలో 54 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పండ్ల పరిశోధనాస్థానం ఏర్పాటు చేసింది తెలంగాణ ఉద్యానశాఖ.

వివిధ రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ఉండి మంచి దిగుబడి ఇచ్చే 17 రకాల మామిడి మొక్కలను 11 ఎకరాల్లో  అల్ట్రాహెడెన్సిటీ విధానంలో పెంచుతోంది. ఇవన్ని తల్లిమామిడి మొక్కలు . వీటినుండి అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తయిన అంటు మొక్కలను తయారు చేస్తూ తక్కువ ధరకే రైతులకు అందిస్తోంది.

ప్రస్థుతం మామిడి నాటే సమయం కనుక కొత్తగా తోటలు వేయబోయే రైతాంగం మామిడి అంటు మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవిధంగా నాటుకోవాలలో తెలియజేస్తున్నారు ఉద్యాన అధికారి సురేంద్రనాథ్. మామిడి పండ్ల మొక్కలు కావాల్సిన రైతులు ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ములుగు గ్రామం, ములుగు మండలం, సిద్దిపేట జిల్లా వారిని సంప్రదించవచ్చు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

ట్రెండింగ్ వార్తలు