Cotton Farming : పత్తిలో గులాబి పురుగు నివారణ ముందస్తు జాగ్రత్తలు

Cotton Farming : ప్రస్తుతం ఖరీప్ కొన్ని చోట్ల పత్తిని విత్తారు. మిగితా రైతులు సరైన వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. పత్తిని సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే గులాబి రంగు పురుగు నివారణ పట్ల పంట తొలిదశ నుండే అప్రమత్తంగా ఉండాలి.

Cotton Farming : పత్తిలో బీటీ రకాల రాకతో కాయతొలుచు పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకున్న రైతులకు గులాబిరంగు పురుగులు తలనొప్పిగా మారాయి. నాలుగైదేళ్లుగా పత్తి పంటను గులాబి రంగు పురుగుల ఆశించి నష్టాలను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఖరీప్ కొన్ని చోట్ల పత్తిని విత్తారు.

మిగితా రైతులు సరైన వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. పత్తిని సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే గులాబి రంగు పురుగు నివారణ పట్ల పంట తొలిదశ నుండే అప్రమత్తంగా ఉండాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో దీన్ని ఆదిలోనే అరికట్టాలంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజశేఖర్ .

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు.  ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో  సాగవుతోంది. అయితే సాగు విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. మొదట్లో సూటి రకాలను సాగుచేసేవారు . క్రమేపీ శనగపచ్చపురుగును తట్టుకునే విధంగా బి.టి-1 పత్తి రకాలను విడుదలచేశారు. పొగాకు లద్దెపురుగు కూడా పత్తికి సమస్యగా మారటంతో రెండింటినీ తట్టుకునే విధంగా బి.టి-2 పత్తి రకాలు విడుదలయ్యాయి.

కొన్నాళ్లు బాగానే ఉన్నా, నాలుగేళ్ల నుండి ఈ పంటను గులాబి రంగు పురుగు పట్టి పీడిస్తోంది. దేశంలో వాడే 60 శాతం పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  హైబ్రిడ్‌ బీటీ పత్తి రకాలు ప్రవేశించిన తరువాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది.

కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్‌ బీటీ పత్తి మాయలో పడ్డారు. 2 వేల సంవత్సరంలో దేశంలో ప్రారంభించిన బీటీ పత్తిసాగు ఇప్పటివరకు మంచి ఫలితాలనే అందించినా, గులాబి రంగు పురుగు దీనికి నిరోధక శక్తిని పెంచుకోవటంతో గత అనుభవాల దృష్ట్యా పత్తి పంటపై నీలినీడలు కమ్ముకున్నాయి.

వాస్తవానికి గులాబి రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు. ఈ  పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు , నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ పురుగు నివారణ చర్యల్లో భాగంగా గత పంట అవశేషాలను పూర్తిగా నాశనం చేయాలి. పత్తి విత్తే రైతాంగం సామూహికంగా ఒకేసారి విత్తితే ఈ పురుగు నష్టం తక్కువగా వుంటుంది. పంటలో  గులాబి రంగు పురుగు ఉనికిని  గుర్తించినట్లైతే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించ వచ్చంటున్నారు  పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజశేఖర్.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

ట్రెండింగ్ వార్తలు