Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

Agri Tips : తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు రైతులు.

Agri Tips : ఖరీఫ్ ప్రారంభమైంది. ఇప్పటికే దీర్ఘకాలిక వర రకాలను నారుమడులు పోసుకున్నారు రైతులు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో తెలియని పరిస్థితులు. అందుకే అతితక్కువ కాలంలో పంట చేతికొచ్చే పలు రకాలు సాగుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక రకాలేంటివి.. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా రెండు మూడేళ్లుగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగళ్లు కురవడంతో పంట మొత్తం నేలపాలవుతోంది.

మరోవైపు సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను సాగుచేయాలని  శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అసలు ఖరీఫ్ కు అనువైన  స్వల్పకాలిక రకాలేంటీవి..? వాటి గుణగణాలేంటో  రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సతీష్ చంద్ర .

వరిసాగులో రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అనేక స్వల్పకాలిక దొడ్డుగింజ రకాలు ఉన్నాయి. కొంత వరకు తెగుళ్లు తట్టుకునే రకాలు వాటి గుణగణాలు చూద్దాం..

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ట్రెండింగ్ వార్తలు