Beans Cultivation : చిక్కుడులో వేరుకుళ్లు తెగులు – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

Beans Cultivation : ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలున్నా పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా వుంది.  ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో వుంది.

Beans Cultivation : ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయల పంటలలో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలున్నా పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా వుంది.  ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో వుంది. ఈ పంటకు చాలా చోట్ల వేరుకుళ్లు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తోంది. కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చంటూ, యాజమాన్యచర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

మార్కెట్ లో చిక్కుడుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా మంది రైతులు చిక్కుడు పంటను సాగుచేశారు. ప్రస్తుతం పూత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది.  ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చిక్కుడు పంటకు వేరుకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు మొలక దశనుండి కోత దశవరకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆశించిన ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా ఉంటూ, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుందని, తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్.

సాధారణంగా ఈ తెగులు ఒక మొక్కనుండి మరోమెక్కకు ఆశిస్తుంది. కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి మంచి మొక్కలను నీరు పారించవద్దు.  తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయడం ద్వారా ఇతర మొక్కలకు ఆశించకుండా ఉండి, మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారముంటుంది.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు