Cultivation Of Turmeric : హైడ్రోఫోనిక్ విధానంలో.. బస్తాల్లో పసుపు సాగు

చెర్రీటమాట పండించిన ఈ యువకుడు ప్రయోగాత్మకంగా ఈ సారి మేఘాలయాకు చెందిన  రకానికి చెందిన  లాక్డాంగ్ పసుపు రకాన్ని పండిస్తున్నారు. మేఘాలయ కు చెందిన ఈ రకం పంటకాలం 9 నెలలు. ఇప్పటికే 8 నెలలు పూర్తయ్యింది.

Cultivation of turmeric

Cultivation Of Turmeric : వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేసి విజయం సాధిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు. గ్రోబ్యాగ్స్ లో హైడ్రోఫోనిక్ విధానంలో మట్టి లేకుండానే పసుపు మొక్కలను పెంచి అబ్బుర పరుస్తున్నారు.

READ ALSO : Turmeric Crop Cultivation : మేలైన పసుపు రకాలు.. సాగు యాజమాన్యం

అరఎకరం లోనే 20 వేల మొక్కలు నాటి 20 వేల కిలోల దిగుబడిని తీసేందుకు సిద్ధమయ్యారు. సంచుల్లో పండిన పసుపును .. విత్తనంగానే కాకుండా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకు అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే …

చదివింది ఏరోనాటికల్ ఇంజనీర్… చేసేది మాత్రం వ్యవసాయం… లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదులుకోని వ్యవసాయం బాట పట్టాడు….  తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం, చిల్లమూరు గ్రామానికి చెందిన యువకుడు  ప్రవీణ్. తనకు ఉన్న పొలంలో అర ఎకరంలో పాలీహౌస్ నిర్మించి  గ్రీన్ నెక్ట్స్ ఆగ్రో  పేరుతో హైడ్రో ప్రోనిక్స్ విధానంలో పంటలు పండిస్తున్నారు.

READ ALSO : Turmeric Production : పసుపు తీతలో జాగ్రత్తలు.. నాణ్యమైన పసుపు ఉత్పత్తికి మెళకువలు

ఇప్పటికే చెర్రీటమాట పండించిన ఈ యువకుడు ప్రయోగాత్మకంగా ఈ సారి మేఘాలయాకు చెందిన  రకానికి చెందిన  లాక్డాంగ్ పసుపు రకాన్ని పండిస్తున్నారు. మేఘాలయ కు చెందిన ఈ రకం పంటకాలం 9 నెలలు. ఇప్పటికే 8 నెలలు పూర్తయ్యింది. ఇంతగా ఈ పసుపు గురించి చెపుతున్నది ఎందుకంటే సాధారణ రకాలతో పోల్చితే ఈ రకంలో అత్యధికంగా కుర్కుమిన్ శాతం ఉంటుంది.

దాదా పు7 నుండి 12 శాతం వరకు కుర్కుమిన్ ఉండటంతో మార్కెట్ లో కూడా అధిక ధర పలుకుతుంది. అందుకే ప్రవీణ్ ప్రయెగాత్మకంగా అర ఎకరంపాలీహౌస్ లో మట్టిలేకుండా హైడ్రోఫోనిక్ విధానంలో సాగుచేస్తూ… సత్ఫలితాలను పొందేందుకు సిద్ధమవుతున్నారు.

READ ALSO : Intercrop In Papaya : బొప్పాయిలో అంతర పంటగా పసుపు సాగు

యువరైతు ప్రవీణ్ సొంతంగానే నర్సరీ తయారు చేసుకున్నారు. ఇందుకోసం 500 కిలోల విత్తనం పట్టింది. అర ఎకరంలో 10 వేల గ్రోబ్యాక్స్ ను ఉపయోగించి అందులో ఎలాంటి మట్టిని వాడకుండా.. కేవలం కోకో ఫీట్ నింపారు. ఒక్కో బస్తాలో రెండు మొక్కలను నాటారు.

ప్రస్తుతం ఒక్కో మొక్కనుండి ఒక కిలో దిగుబడి వస్తుంది. అంటే 20 వేల మొక్కల నుండి  20 వేల కిలోల దిగుబడి అన్నమాట. మార్కెట్ లో సరాసరి పచ్చి పసుపు కిలో ధర రూ. 200 చొప్పున అమ్మినా.. 20 వేల కిలోలకు 40 లక్షల ఆదాయం ఎక్కడ పోదు. పెట్టుబడి 5 లక్షలు పోయినా.. ఏడాదికి  రూ. 35 లక్షల నికర ఆదాయం పొందే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు