Drive-Through Vaccine Centre : ఢిల్లీలో డ్రైవ్-థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం..వ్యాక్సిన్ల సరఫరాకు స్పుత్నిక్‌ వీ అంగీకారించిందన్న కేజ్రీవాల్

ఢిల్లీలోని ద్వారకాలోని వెగాస్ మాల్‌లో ఢిల్లీ మొట్టమొదటి డ్రైవ్-థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్(ఇక్కడ ప్రజలు తమ కారులోనే కూర్చొని వ్యాక్సిన్ వేయించుకోవచ్చు)ని బుధవారం సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు.

Drive-Through Vaccine Centre ఢిల్లీలోని ద్వారకాలోని వెగాస్ మాల్‌లో ఢిల్లీ మొట్టమొదటి డ్రైవ్-థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్(ఇక్కడ ప్రజలు తమ కారులోనే కూర్చొని వ్యాక్సిన్ వేయించుకోవచ్చు)ని బుధవారం సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. ఆకాష్ హాస్పిటల్ సహకారంతో ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటైంది. 18+ మరియు 45+ ​​వయస్సు గల వారితో సహా ఈ వ్యాక్సినేషన్ సెంటర్ లో రెండు రకాల వ్యాక్సిన్ అపాయింట్మెంట్లు(18+ మరియు 45+ ​​వయస్సు గల వారికి) ఇవ్వబడతాయి. కోవిన్‌లో యాప్ వ్యాక్సిన్ కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

రాబోయే రోజుల్లో మరిన్ని డ్రైవ్-థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్ లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అయితే ఇక్కడ సమస్య వ్యాక్సిన్ల సరఫరా అని కేజ్రీవాల్ నొక్కి చెప్పారు. సాధ్యమైనంత తర్వగా ఢిల్లీకి..కేంద్రప్రభుత్వం వ్యాక్సిన్ లు పంపుతుందని ఆశిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ల కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లు మూతబడ్డాయని తెలిపారు. ఢిల్లీకి నెలకి 80లక్షల వ్యాక్సిన్ డోసులు అవసరముందని కేజ్రీవాల్ చెప్పారు. కేంద్రం అత్యవసర భావనను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది మరియు టీకా డ్రైవ్‌ను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ తెలిపారు.

ఈ సందర్భంగా..రష్యా కొవిడ్‌ వ్యాక్సిన్‌ “స్పుత్నిక్‌ వీ” డోసులను ఢిల్లీకి సరఫరా చేసేందుకు తయారీదారులు అంగీకరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే, ఎన్ని డోసులు సరఫరా చేస్తారన్న దానిపై నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు స్పుత్నిక్ వీ తయారీదారులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, వ్యాక్సిన్ తయారీ కంపనీ ప్రతినిధులు మంగళవారం కూడా చర్చలు జరిపినట్టు చెప్పారు.

కాగా, ఢిల్లీలో 620 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్టు ఆయన తెలిపారు. అయితే, ట్రీట్మెంట్ లో ఉపయోగించే ఆంఫోటెరిసిన్‌-B ఇంజెక్షన్ల కొరత ఉందన్నారు. ఇక, మోడరనా మరియు ఫైజర్ తయారుచేసిన వ్యాక్సిన్లు రెండూ పిల్లలకు అనుకూలంగా ఉన్నాయని, పిల్లలకు టీకాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం వీటిని సేకరించాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు