Delhi LG Vs AAP: కేజ్రీవాల్ ప్రభుత్వానికి షాకిచ్చిన ఢిల్లీ ఎల్‌జీ.. ఆప్ నుంచి రూ. 97కోట్లు రికవరీ చేయాలట ..

ఢిల్టీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఎల్‌జీ (లెఫ్టినెంట్ గవర్నర్) షాకిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రూ. 97 కోట్లు రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు వెళ్లాయి.

Delhi LG Vs AAP: ఢిల్టీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఎల్‌జీ (లెఫ్టినెంట్ గవర్నర్) షాకిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రూ. 97 కోట్లు రికవరీ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రాజకీయ ప్రకటనలను ముద్రించిందని ఆరోపించారు. ఈ మేరకు 2015 సుప్రీంకోర్టు ఆర్డర్, 2016 ఢిల్లీ హైకోర్ట్ ఆర్డర్, 2016 సీసీఆర్‌జీఏ ఆర్డర్ నేపథ్యంలో ఎల్‌జీ ఆదేశాలు వచ్చాయి. కోర్టు ఆదేశాలను ఆప్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.

Delhi Govt: ప్లాస్టిక్ నిషేదాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు షురూ

ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా కేజ్రీవాల్ ప్రభుత్వంలో లోపాలను గవర్నర్ ఎత్తిచూపుతున్నారు. 2015లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అయ్యారు. ఆ తరువాతి కాలంలో ఆప్ ప్రభుత్వం నిర్వహించే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే, ప్రభుత్వం సొమ్ముతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పార్టీ ప్రచారానికి వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి.

Delhi CM Arvind Kejriwal: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్‌ను బీజేపీ ఎందుకు తీసుకురావడం లేదు?

ఈ నేపథ్యంలో 2016 సెప్టెంబర్ నుంచి వచ్చిన అన్ని ప్రకటనలు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించి నిర్ధారించుకోవడానికి సీసీఆర్‌జీఏకి పంపాలని కూడా ఎల్‌జీ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. ఇదిలాఉంటే రూ. 97కోట్ల చెల్లింపుకు ఎల్‌‌జీ 15 రోజుల సమయం ఇచ్చారు.  అయితే ప్రభుత్వంనుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

ట్రెండింగ్ వార్తలు