Delhi Air Quality : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. ‘వెరీ పూర్’ ఇదే ఫస్ట్ టైం!

ఢిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులను వాయుకాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్టు కనిపిస్తోంది.

Delhi Air Quality : దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులను వాయుకాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్టు కనిపిస్తోంది. గాలి నాణ్యత కూడా తీవ్రంగా తగ్గినట్టు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ (SAFAR) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనంతో గాలిలో భారీగా కాలుష్య కారకాలు చేరాయని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQ1) 303గా వెల్లడించింది. గాలిలో దుమ్ము, ధూళి, కాలుష్య కారకాల శాతం ప్రమాదకర స్థాయిలో పెరిగిందని తెలిపింది. మరో వారం రోజుల్లో వాయు కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీపావళికి ముందు.. ఈ సీజన్‌లో మొదటిసారిగా ఢిల్లీలో గాలి నాణ్యత (వెరీ పూర్ కేటగిరీలో చేరింది) క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) 303గా నమోదైంది. ఢిల్లీ పొరుగు నగరాలైన ఫరీదాబాద్ (306), ఘజియాబాద్ (334), నోయిడా (303) కూడా చాలా తక్కువ గాలి నాణ్యతను నమోదు అయింది. అక్టోబర్ 17న పూర్ కేటగిరీలో ఉన్న ఢిల్లీలో ఈ సీజన్‌లో అత్యధిక AQI 298గా నమోదైంది. వాయు కాలుష్యం స్థానిక వనరుల కారణంగా పెరిగిందని పిటిఐ నివేదించింది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీ వాయు కాలుష్యంలో వ్యవసాయ వ్యర్థాలు తక్కువగానే ఉన్నాయి. దీపావళి తర్వాత ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. దీపావళి రాత్రికి ఢిల్లీలోని గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
Read Also : Dhanteras : ధంతేరాస్ : భారీగా పెరిగిన బంగారం కొనుగోళ్లు.. హాల్‌మార్క్ ఉంటేనే కొనేది!

నవంబర్ 1, 2 తేదీల్లో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంటుందని సఫర్ అంచనా వేసింది. నవంబర్ 4 వరకు గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయికి పడిపోవచ్చునని భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారమే అంచనా వేసింది. నవంబర్ 5 నుంచి 6 తేదీల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలోని పలు వాయుకాలుష్య ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్ తెలిపింది. PM2.5 అనేది తీవ్ర కాలుష్యకారిణిగా IMD పేర్కొంది.

ప్రభుత్వ ఏజెన్సీల ప్రకారం.. AQI అనేది.. 0 నుంచి 5 మధ్య నమోదైతే.. అది గాలి నాణ్యత మంచి స్థాయిలో ఉన్నట్టు.. అదే 51-100 మధ్య ఉంటే పర్వాలేదు.. 101-200 మధ్య ఉంటే మోస్తరుగా ఉన్నట్టు.. 201-300 మధ్య గాలి నాణ్యత నమోదైతే చాలా పేలవంగా ఉందని, 301- 400 మధ్య ఉంటే మరి అధ్వాన్నంగా ఉందని, ఇక చివరిగా 401-500 మధ్య ప్రమాదకర స్థాయిలో ఉందని గుర్తిస్తారు. దీపావళి సందర్భంగా టపాసులు పేలిస్తే గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలి కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
Read Also : Vishal : తిరుమలకు హీరో విశాల్.. రోజాతో కలిసి సినిమా ప్రమోషన్

ట్రెండింగ్ వార్తలు