Rahul Gandhi’s Kaurava dig: పాండవుల్లో 50 ఏళ్ల వయసులో తమ చెల్లికి ముద్దు పెట్టిన వారు ఎవరు?: రాహుల్‌కి యూపీ మంత్రి ప్రశ్న

పాండవుల్లో 50 ఏళ్ల వయసులో తమ చెల్లికి ముద్దు పెట్టిన వారు ఎవరు? అని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీని ఉత్తరప్రదేశ్ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ ప్రశ్నించారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ ను రాహుల్ గాంధీ ‘‘21వ శతాబ్దపు కౌరవులు’’ అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో రాహుల్ కు దినేశ్ ప్రతాప్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఓ సభలో తన చెల్లి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీకి రాహుల్ ఆప్యాయంగా ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని దినేశ్ ప్రతాప్ సింగ్ గుర్తు చేశారు.

Rahul Gandhi’s Kaurava dig: పాండవుల్లో 50 ఏళ్ల వయసులో తమ చెల్లికి ముద్దు పెట్టిన వారు ఎవరు? అని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీని ఉత్తరప్రదేశ్ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ ప్రశ్నించారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ ను రాహుల్ గాంధీ ‘‘21వ శతాబ్దపు కౌరవులు’’ అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో రాహుల్ కు దినేశ్ ప్రతాప్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఓ సభలో తన చెల్లి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీకి రాహుల్ ఆప్యాయంగా ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని దినేశ్ ప్రతాప్ సింగ్ గుర్తు చేశారు.

‘‘ఆర్ఎస్ఎస్ ని రాహుల్ గాంధీ కౌరవులు అని అంటున్నారు. అంటే, రాహుల్ గాంధీ పాండవుడా? ఒక వేళ రాహుల్ తనను తాను పాండువుడు అనుకుంటే, ద్వాపర యుగంలో ఏ పాండవుడు 50 ఏళ్ల వయసులో ప్రజా సభలో చెల్లికి ముద్దు పెట్టాడు?’’ అని దినేశ్ ప్రతాప్ సింగ్ ప్రశ్నించారు. ఇలా ముద్దులు పెట్టడం మన భారతీయ సంస్కృతి కాదని చెప్పారు. ఇలా ప్రవర్తించడాన్ని మన సంస్కృతి ఒప్పుకోదని అన్నారు.

కాగా, దినేశ్ ప్రతాప్ సింగ్ 2019 లోక్ సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేతిలో ఓడిపోయారు. 2024లో మాత్రం సోనియా గాంధీ గెలవబోరని తాాజాగా అన్నారు. రాయ్‌బరేలీ నుంచి వైదొలగనున్న చివరి విదేశీయురాలు సోనియా గాంధీ అని వ్యాఖ్యానించారు.

తాను విదేశీయురాలని కాదని సోనియా గాంధీ చెప్పగలరా? అని ప్రశ్నించారు. విదేశీయురాలు కాబట్టే ఆమె గతంలో భారతదేశ ప్రధాని కాలేకపోయారని అన్నారు. విదేశీయులు మన దేశాన్ని పాలించడాన్ని భారతీయులు ఒప్పుకోరని చెప్పారు.

Golden Globe Award to RRR : మరో భారీ అవార్డు సొంతం చేసుకున్న RRR… ‘నాటు నాటు’ సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు..

ట్రెండింగ్ వార్తలు