Virat Kohli : డ‌గౌట్‌లో క‌ద‌ల‌కుండా కూర్చొన్న కోహ్లి.. కోచ్ ద్ర‌విడ్ ఏం చేశాడంటే..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త‌ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ ఫైన‌ల్ చేరుకుంది.

Virat Kohli – Rahul Dravid : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త‌ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ ఫైన‌ల్ చేరుకుంది. అయితే టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి మాత్రం విఫ‌లం అవుతున్నాడు. ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించి మంచి ఫామ్‌తో పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో అడుగుపెట్టిన కోహ్లి అనూహ్యంగా త‌డ‌బ‌డుతున్నాడు. కీల‌క‌మైన సెమీఫైన‌ల్ మ్యాచులో 9 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

కాగా.. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఏడు ఇన్నింగ్స్‌లు ఆడ‌గా.. ఐదు సంద‌ర్భాల్లో సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 75 ప‌రుగులు చేశాడు. ఇంగ్లాండ్ పై సింగిల్ డిజిట్‌కే ఔటైన త‌రువాత డ‌గౌట్‌లో కోహ్లి చాలా నిరాశ‌గా క‌నిపించాడు. ఈ క్ర‌మంలో కోచ్ రాహుల్ ద్ర‌విడ్ అత‌డిని ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

INDW vs SAW : తొలి రోజే 500+ స్కోరు.. భార‌త మ‌హిళ‌ల రికార్డు స్కోరు

ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ల మ‌ధ్య కోహ్లి కూర్చున్న‌ట్లుగా వీడియోలో క‌నిపించింది. మ్యాచ్‌ను కోహ్లి చాలా సీరియ‌స్‌గా చూస్తూ దాదాపుగా క‌ద‌ల‌కుండా ఉన్నాడు. దీన్ని గ‌మ‌నించిన ద్ర‌విడ్ అత‌డి ఓదార్చిన‌ట్లుగా క‌నిపించింది. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా.. నిన్ను మేము అలా చూడ‌లేం అని కోహ్లి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ అనంత‌రం విరాట్ ఫామ్‌పై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు రోహిత్ ఇలా సమాధానం చెప్పాడు. కోహ్లి ఫామ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే.. అదేమీ పెద్ద స‌మ‌స్య కాద‌న్నాడు. అత‌డు క్లాస్ ప్లేయ‌ర్ అని చెప్పాడు. గ‌త 15 ఏళ్లుగా కోహ్లి ఆడుతున్నాడ‌ని, అత‌డి ఆట తీరు అద్భుతం అని చెప్పాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ తుది జ‌ట్టులో కోహ్లి ఉంటాడ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేద‌న్నాడు. త‌న ఎన‌ర్జీ మొత్తాన్ని ఫైన‌ల్ కోసం అత‌డు దాచి పెట్టాడేమో.. తుది పోరులో త‌ప్ప‌కుండా అత‌డు కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌తాడ‌నే న‌మ్మ‌కం ఉంది అని రోహిత్ అన్నాడు.

IND vs ENG : ఇట్స్ టైమ్ ఫ‌ర్ ల‌గాన్‌.. ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా స్వీట్ రివెంజ్‌.. మీమ్స్ వైర‌ల్‌..

ట్రెండింగ్ వార్తలు