Peru violence: పెరులో హింసాత్మక ఘటనలు.. 17 మంది మృతి.. రాత్రి వేళల్లో కర్ఫ్యూ

పెరులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఘర్షణల్లో 17 మంది మృతి చెందారు. దీంతో మూడు రోజుల పాటు రాత్రి వేళ్లలో ప్యునోలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు పెరు ప్రధాన మంత్రి అల్బర్టో ఒటారొలా చెప్పారు. పెరు కాలమానం ప్రకారం గత రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మూడు రోజుల పాటు ఈ కర్ఫ్యూ ఉంటుంది.

Peru violence: పెరులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఘర్షణల్లో 17 మంది మృతి చెందారు. దీంతో మూడు రోజుల పాటు రాత్రి వేళ్లలో ప్యునోలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు పెరు ప్రధాన మంత్రి అల్బర్టో ఒటారొలా చెప్పారు. పెరు కాలమానం ప్రకారం గత రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మూడు రోజుల పాటు ఈ కర్ఫ్యూ ఉంటుంది.

దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను జైలు నుంచి విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, జూలియాకా నగరంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో 68 మంది ప్రజలు గాయపడ్డారు. డిసెంబరు నుంచి పెరులో ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి.

దీంతో ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు మొత్తం 39 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆందోళనకారులు రోడ్డులను బ్లాక్ చేస్తుండడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగాయి.

Rapist Jalebi Baba : బాబోయ్.. ఈ జిలేబీ బాబా మామూలోడు కాదు, ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం

ట్రెండింగ్ వార్తలు