క్రేజీ రిచ్ వెడ్డింగ్.. అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌గా 66 వేల రూపాయల క్యాష్.. నమ్మలేకపోతున్నారా!

పెళ్లికి వచ్చిన అతిథులు ఒక్కొక్కరికి ఏకంగా 66 వేల రూపాయల క్యాష్ రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా?

Crazy Rich Asian Wedding: మీరు చాలా రకాల పెళ్లిళ్లు చూసుంటారు. కానీ ఇలాంటి క్రేజీ మ్యారేజ్ ఎప్పుడూ చూసుండకపోవచ్చు. కనీసం వినుండకపోవచ్చు. ఏంటి అంత స్సెషల్ అనుకుంటున్నారా? క్రేజీ రిచ్ ఆసియన్స్ సినిమా మీలో ఎవరైనా చూశారా? చూడని వారు ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ డానా చాంగ్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ సినిమాలో చూపించినట్టుగా మోస్ట్ లగ్జరీ వెడ్డింగ్ రియల్ లైఫ్‌లో జరిగింది. ఈ విజువల్స్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఏముంది ఈ వీడియో అంటారా? సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను మీరే చూసేయండి.

 

పెళ్లికి వచ్చిన అతిథులకు వారి జీవితంలో మర్చిపోలేని మధురాభూతిని మిగిల్చేందుకు నిర్వాహకులు గొప్పగా ఏర్పాట్లు చేశారు. గెస్టులను విమానాల్లోకి తీసుకొచ్చి.. తిరిగి ఫ్లైట్లలోనే సాగేనంపారు. ఐదు రోజుల పాటు విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి పెళ్లి మండపడానికి అతిథులను రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లలో తరలించారు. పెళ్లి మండపంలో ఫ్లవర్ డెకరేషన్ అయితే అదిరిపోయింది. వధూవరుల ఫొటోలతో న్యూస్ పేపర్లు కూడా సిద్ధం చేశారు. అంతేకాదు పెళ్లికి వచ్చిన అతిథులు ఒక్కొక్కరికి రెడ్ కలర్ కవర్‌లో 800 డాలర్లు(సుమారు 66 వేల రూపాయలు) పెట్టి రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా? చైనాలో జరిగింది.

Also Read: సునీతా విలియమ్స్‌ సేఫేనా.. తిరుగు ప్రయాణం ఎప్పుడు.. స్పేస్ ఎక్స్ సాయం నిజమేనా?

ఈ క్రేజీ వెడ్డింగ్ వీడియో చూసి సోషల్ మీడియాలో రకరకాల కామెంటు పెడుతున్నారు. అతిథులకు 66 వేల రూపాయలు రిటర్న్ గిఫ్టుగా ఇచ్చారంటే వాళ్లెంత కుబేరులో అంటూ ఆశ్చర్యపోతున్నారు. తమ ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులను ఇంతగా గౌరవించడం నచ్చిందని.. గెస్టుల ప్రయాణ ఖర్చులు పెళ్లివారే భరించడం బాగుందని నెటిజనులు ప్రశంసిస్తున్నారు. పేదోళ్ల గురించి కూడా ఆలోచించాలని కొంత మంది సలహాయిచ్చారు. ఏదేమైనా ఈ పెళ్లి మాత్రం వార్తల్లోకి ఎక్కింది.

ట్రెండింగ్ వార్తలు