Ice Cream : వర్షకాలంలో ఐస్ క్రీం తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?

వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో వేడి ఆహారపదార్ధాలు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలా కాకుండా చల్లని పదార్ధాలను తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఐస్ క్రీం వంటి వాటిని తీసుకుంటే దాని ప్రభావం వల్ల జలుబు, దగ్గు, ఛాతీలో భారం వంటి సమస్యలు వస్తాయి.

Ice Cream

Ice Cream : పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ లు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. వేసవి కాలం వచ్చింది అంటే చల్లని ఐసీ క్రీమ్ ల వైపు మొగ్గు చూపుతారు. వేసవిలో ఐస్ క్రీం ఎక్కువగా తింటారు. వేసవిలో ఐస్ క్రీం తినడం వల్ల ఆరోగ్య పరంగా పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోకపోయినప్పటికీ , వర్షాకాలంలో ఐస్‌క్రీం తింటే మాత్రం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో వేడి ఆహారపదార్ధాలు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలా కాకుండా చల్లని పదార్ధాలను తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఐస్ క్రీం వంటి వాటిని తీసుకుంటే దాని ప్రభావం వల్ల జలుబు, దగ్గు, ఛాతీలో భారం వంటి సమస్యలు వస్తాయి. ఇన్ఫెక్షన్ కారణంగా వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. వర్షాకాలంలో ఐస్ క్రీం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలహీనపడుతుంది. గొంతు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఐస్ క్రీంలో చక్కెర, కేలరీలు, కొవ్వు ఉంటాయి. ఊబకాయం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఐసీ క్రీం లు తినటం వల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికం అవుతాయి. వర్షాకాలంలో ఐస్‌క్రీం తినడం వల్ల మెదడు నరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తలనొప్పి , దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐస్ క్రీం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అధికంగా బరువు పెరగటానికి కారణమౌతుంది.

 

ట్రెండింగ్ వార్తలు