SRK’s Son Aryan : క్రూయిజ్ డ్రగ్స్ కేసు, ఆర్యన్ ఖాన్‌‌కు బెయిల్ వస్తుందా ?

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ప్రస్తుతం ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు

Drugs On Cruise Case : బాలీవుడ్‌ను షేక్ చేసిన క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. ఈ కేసుతో సంబంధం ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ప్రస్తుతం ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు. 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం రాత్రి అతనితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు.. షిప్‌లో రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌పై విచారణ జరుపుతున్నారు. రేవ్ పార్టీ ఎవరు జరిపించారు? డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2021, అక్టోబర్ 04వ తేదీ సోమవారం సాయంత్రం వరకు విచారించి.. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Read More : Shah Rukh – Salman: సీన్‌లోకి సల్మాన్… షారూక్ కొడుకుకు క్లీన్ సర్టిఫికేట్ వచ్చేనా..!

మరోవైపు క్రూయిజ్‌ షిప్ రేవ్‌ పార్టీ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌ ఫోన్ డేటాను పరిశీలించిన ఎన్సీబీ అధికారులు.. అందులో డ్రగ్స్ లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్క షిప్‌ వ్యవహారంలో మాత్రమే కాదని.. అంతకుముందు నుంచే ఆర్యన్‌ డ్రగ్స్‌కు బానిస అయినట్టు తెలుస్తోంది. అయితే రేవ్ పార్టీకి ఆర్యన్ ఖాన్ తనంతట తానే వచ్చాడా? లేక ఎవరైనా తీసుకొచ్చారా? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే… మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరబోమని ఎన్సీబీ చెప్పడం ఆర్యన్‌కు ఊరట కల్పించింది. దీంతో ఆర్యన్ తరపు లాయర్లు సోమవారం బెయిల్‌ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

Read More : Bollywood : రేవ్ పార్టీ కేసు, సమీర్ వాంఖెడే ఎవరో తెలుసా ?

ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో అతన్ని ముంబైలోని కిల్లా కోర్టుకు తరలించారు. ఏడున్నర గంటలకు వాదనలు ప్రారంభం కాగా… కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ వాదించింది. ఇరు వర్గాలు వాడివేడిగా వాదనలు వినిపించాయి. ఆర్యన్‌పై ఎన్సీబీ అధికారులు సెక్షన్‌ 8C, 20B, 27కింద కేసుల నమోదు చేశారు. అయితే ఆ సెక్షన్లు అన్నీ బెయిలబుల్ అని.. తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్ సతీశ్ మనీష్ పాండే కోర్టును కోరారు. అయితే కేసులో పూర్తి వివరాల కోసం ఆర్యన్ సహా ముగ్గురిని విచారించాల్సి ఉందని ఎన్సీబీ వాదించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఎన్సీబీతో ఏకీభవించింది. ఆర్యన్‌ను ఒకరోజు కస్టడీకి ఇచ్చిన న్యాయస్థానం.. మరో ఇద్దరికి రెండు రోజులు కస్టడీకి ఇచ్చింది. మరి ఆర్యన్ ఖాన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు