Delhi Liquor Scam : మోదీ జిందాబాద్ అంటే కవితను వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారు : సీపీఐ నారాయణ

మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటనే వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుఅయ్యారు. దీంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియాతో, అరుణ రామచంద్ర పిళ్లైతో పాటు కవితనకు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కవితతో పాటు ఏడుగురిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం ఐదుగురు ఈడీ అధికారుల బృందం కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి కవిత నుంచి వచ్చిన సమాధానలను బట్టి ఆమెను అరెస్టు చేస్తారా లేదా అన్నది ఉత్కంఠ గా మారింది..

Delhi Liquor Scam : మోదీ జిందాబాద్ అంటే కవితను వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారు : సీపీఐ నారాయణ

ఈ క్రమంలో కవితను ఈడీ విచారించటంపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ విచారణలు సర్వసాధరణమేనని ‘మోడీ జిందాబాద్ అని అంటే కవితను వెంటనే వదిలేస్తారు..లేదంటే జైల్లో వేస్తారు’అంటూ వ్యాఖ్యానించారు నారాయణ. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని బీజేపీ ఉద్ధేశ్యమని..ప్రశ్నించినా..ఎదిరించి విమర్శలు చేసినా ఇటువంటి ఇబ్బందులు పెట్టటం బీజేపీకి అలవాటేనని అన్నారు.

బీజేపీ తనకు వ్యతిరేకంగా ఉండేవారిని వెంటాడడం వేటాడడం చేస్తుందని ఇది అనాగరికమని విమర్శించారు. శత్రుశేషం లేకుండా చేయటమే బీజేపీ ఉద్ధశ్యమని అటువంటి బీజేపీపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈడీలు,సీబీఐలు ఎంతమంది వచ్చినా బెదరకుండా పోరాడాలన్నారు. నిరుత్సాహపడకూడదని ధైర్యంగా పోరాడుతు ముందుకుపోవాలని సూచించారు. సమస్యలు వచ్చాయని భయపడితే మరింతగా భయపెట్టటం..బెదిరించటం బీజేపీ నైజం అని అటువంటి అహంకారపూరిత బీజేపీపై ప్రతీ ఒక్కరు పోరాడాలని సూచించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

Delhi Liquor Scam MLC kavitha : తండ్రి కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

 

ట్రెండింగ్ వార్తలు