Land for Jobs Scam: లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో రూ.600 కోట్ల అవినీతి బట్టబయలు.. ఈడీ

ఢిల్లీ, పాట్నా, రాంచీ, ముంబై ప్రాంతాల్లో సోదాలు ప్రముఖంగా నిర్వహించారు. ఇక శుక్రవారం నిర్వహించిన సోదాల్లో 70 లక్షల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం నగలు, 540 గ్రాముల బంగారు వస్తువులు, 900 అమెరికా డాలర్లు లభించాయట. ఇవన్నీ లెక్కలో లేనట్లు ఈడీ పేర్కొంది.

Land for Jobs Scam: లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో శనివారం దేశంలోని 24 ప్రాంతాల్లో ఎన్‭ఫోర్స్‭మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. కాగా, ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అవినీతి బయటపడిందని ఈడీ పేర్కొంది. కోటి రూపాయల నగదు లభించగా.. సుమారు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు వెల్లడైనట్లు పేర్కొంది. బిహార్ సహా దేశంలోని పలు ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దక్షిణ ఢిల్లీలోని లాలూ ఇంటితో పాటు ఆయన కుమార్తె రాగిణి యాదవ్, చంద యాదవ్, హేమా యాదవ్, ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ అబు దోజానా, అమిత్ కత్యాల్, నవదీప్ సర్దానా, ప్రవీణ్ జైన్ ఇళ్లలో సోదాలు జరిగాయి.

Tihar jail : మనీశ్ సిసోడియాను ఉంచిన తీహార్‌ జైలులో సర్జికల్‌ బ్లేడ్లు, ఫోన్లు, డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఖైదీ..

ఢిల్లీ, పాట్నా, రాంచీ, ముంబై ప్రాంతాల్లో సోదాలు ప్రముఖంగా నిర్వహించారు. ఇక శుక్రవారం నిర్వహించిన సోదాల్లో 70 లక్షల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారం నగలు, 540 గ్రాముల బంగారు వస్తువులు, 900 అమెరికా డాలర్లు లభించాయట. ఇవన్నీ లెక్కలో లేనట్లు ఈడీ పేర్కొంది. కాగా ఇదే కేసుకు సంబంధించి లాలూ కుమారుడు తేజశ్వీ యాదవ్‭కు సీబీఐ సమన్లు పంపింది. శనివారం తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ తేజశ్వీ భార్య ఆసుపత్రిలో ఉండడం వల్ల హాజరు కాలేదు.

Raj Bhavan Tension : రాజ్‌భవన్ దగ్గర టెన్షన్ టెన్షన్.. మేయర్, బీఆర్ఎస్ నేతల ఆందోళన, బారికేడ్ల తోసివేత

సీబీఐ నుంచి సమన్లు ఎదుర్కొన్న రాష్ట్రీయ జనతా దళ్ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్‭ శనివారం నాటి సీబీఐ విచారణకు హాజరు కావడం లేదని పార్టీ ప్రకటించింది. గర్భిణి అయిన తేజశ్వీ భార్య ఉన్నట్టుండి స్పృహ తప్పిపడిపోయిందని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నందున సీబీఐ విచారణకు తేజశ్వీ డుమ్మా కొట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో తేజశ్వీకి మార్చి 4వ తేదీన సబీఐ సమన్లు పంపింది. అయితే సీబీఐ ముందు తేజశ్వీ హాజరు కాలేదు. దీంతో తేజశ్వీపై ఆధారాలు, పేపర్ ట్రయిల్ ఆధారంగా రెండోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే తాజాగా భార్య ఆసుపత్రిలో ఉన్న కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐకి తేజశ్వీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Election Commission: ఇక ఇంటి నుంచే ఓటు వేయొచ్చు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త వెసులుబాటు

లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరికీ మార్చి 15న సమన్లు జారీ చేయనున్నారు. 2004-2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో లాలూ కుటుంభ సభ్యులకు భూములు, ఆస్తులు తక్కువ ధరకు బదిలీ చేశారట. అందుకు గాను రైల్వేలో ఆయన ఉద్యోగాలు ఇప్పించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. సీబీఐ ఫిర్యాదు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ కేసు నమోదు చేసింది.

ట్రెండింగ్ వార్తలు