Eatala Rajender : వయసు, అనుభవం ఉన్నవారు ఏది పడితే అది మాట్లాడొద్దు : జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్

వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి...ఏదీ పడితే అది మాట్లాడకూడదు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదన్నారు.

Eatala Rajender

Eatala Rajender : దున్నపోతు ట్రీట్మెంట్ అంటూ వీడియో షేర్ చేసిన బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఈటెల కౌంటర్ ఇచ్చారు. జితేందర్ రెడ్డి గారు ఎందుకు ట్వీట్ చేశారో..‘ఆయన ఉద్దేశ్యం ఏంటో ఆయననే అడగాలని అన్నారు ఈటల. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి…ఏదీ పడితే అది మాట్లాడకూడదు’ అని సూచించారు.ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలన్నారు.ఉన్న స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదన్నారు.

Jithender Reddy : దున్నపోతు ట్రీట్‌మెంట్ అంటూ ట్వీట్ చేసిన మాజీ ఎంపీ .. బీజేపీలో పెను దుమారం

ప్రజ్ఞాపూర్ హరిత రెస్టారెంట్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఈటల సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో సైలెంట్ గా ఉంటున్నారని పార్టీ మారతారు అనే వార్తలు వచ్చిన క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఈటెల అనేటోడు పార్టీ మారాడు ..అంగీ మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీ మారడం అంటే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి బీజేపీ, కాంగ్రెస్ లో కోవర్టులున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజాధనంతో భారీ కాన్వాయితో పర్యటనలు చేస్తున్నారు అంటూ మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్ 600ల కార్లతో జరిపిన పర్యటన గురించి విమర్శించారు. రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పాలించినోళ్ళకు ఏమి తెలియదు నాకే తెలిసినట్లు పీలవుతున్నారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ లో వర్షాలు వస్తే గవర్నర్ ఇంటి ముందే పడవలు వేసుకుని తిరిగే పరిస్థితి నెలకొంది అంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పాలనపై. కరీంనగర్ ని లండన్, హైదరాబాద్ ని డల్లాస్ చేస్తానని చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు కేసీఆర్ అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు సార్లు హైదరాబాద్ ముంపుకు గురైందని..మూసినదిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు