Paddy Nursery : ఖరీఫ్ వరినారుమడులను పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారు కోసం చేపట్టాల్సిన మెళకువలు

వానాకాలం వరి సాగుకు రైతులు సిద్దమవుతున్నారు. మఖ్యంగా వరిసాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకునేందుకు సిద్దమవుతున్నారు. అయితే వరిసాగులో నారుమడి యాజమాన్యం చాలా కీలకం.

Preparation of Paddy Nursery

Paddy Nursery : ఖరీఫ్ పనుల్లో రైతులు బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు నార్లు పోసుకున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోసుకోవడానికి సిద్దమవుతున్నారు. అయితే వరివిత్తనం నారుమడిలో చల్లేముందు నుంచి తగిన మెళకువలు పాటిస్తే, నారు సకాలంలో చేతికి అంది, నారు ముదరకముందే ప్రధాన పోలంలో నాట్లు వేసుకోవచ్చని తెలియజేస్తున్నారు జమ్మికుంట శాస్త్రవేత్తలు.

READ ALSO : Managed Cow Dairy : పశువులపై ఉన్నమమకారంతో ఆవుల డెయిరీ నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

వానాకాలం వరి సాగుకు రైతులు సిద్దమవుతున్నారు. మఖ్యంగా వరిసాగు చేసే రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నారు పోసుకునేందుకు సిద్దమవుతున్నారు. అయితే వరిసాగులో నారుమడి యాజమాన్యం చాలా కీలకం. మడి తయారు చేసుకోవడం, విత్తన మోతాదు, విత్తనశుద్ది, తెగుళ్ల నివారణ, ఎరువుల యాజమాన్యం లాంటి పలు జాగ్రత్తలు తీసుకుంటే నారు ఆరోగ్యంగా పెరుగుతుందని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్.

READ ALSO : Prawn Cultivation : పడిపోతున్న ధరలు, చుక్కలనంటుతున్న ఉత్పత్తి వ్యయం.. రొయ్యరైతు విలవిల

ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ వుండకుండా  చూసుకోవాలి . నీరు నిల్వ వుంటే విత్తనం మురిగిపోతుంది . మడుల మధ్య కాలువలు ఏర్పాటుచేసుకుంటే  నీరు నిల్వ వుండదు. ఏ కారణం చేతైనా పోషకాలను  సకాలంలో అందించని రైతాంగం, పిచికారీ రూపంలో అందిస్తే మంచిది.

ట్రెండింగ్ వార్తలు