Foxconn Investment in Telangana : తెలంగాణలో ఫాక్స్ కాన్ కంపెనీ భారీ పెట్టుబడులు .. లక్షమందికి ఉద్యోగాలు

తెలంగాణలో ఫాక్స్‌కాన్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టటానికి సిద్ధమైంది.సీఎం కేసీఆర్‌తో ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈఓ యంగ్ లియు సమావేశమయ్యారు. కొంగర్‌కలాన్‌లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది కంపెనీ. ఈ సంస్థ ఏర్పాటుతో సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

foxconn investment in Telangana : తెలంగాణ భారీ పెట్టుబడులకు నిలయంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్టుబడులకు స్వర్గధామంగా తయారైంది. దీంట్లో భాగంగా అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టటానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన హోన్ హై టెక్నాలజీ గ్రూప్ కంపెనీ తెలంగాణలో భారీగా పెట్టుబడికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఫ్యాక్ కాన్ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

గురువారం (మార్చి 2,2023) రోజున ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈఓ యంగ్ లియు సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. కాగా.. కొంగర్‌కలాన్‌లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఏర్పాటుతో సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

ఈ ఒప్పందం గురించి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. “తెలంగాణలో ఫాక్స్ కాన్ కంపెనీ మెగా పెట్టుబడికి ముందుకు రావటం హర్షనీయం. ఈ భారీ పెట్టుబడితో.. రాష్ట్రంలోని సుమారు లక్ష మంది యువకులకు ఉపాధి లభించనుంది’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు