Mulberry Fruit : గ్యాస్,కడుపు ఉబ్బరం…మల్బరీ పండ్లతో

మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది. ఎల్ డిఎల్ గ్రాహక చర్యను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. కొలెస్ట్రాల్ స్ధాయిలను నిరోధించటంలో ఈ పండ్లు ఉపకరిస్తాయి.

Mulberry

Mulberry Fruit : పట్టుపురుగుల మేతకోసం మల్బరీ సాగు చేపడుతున్నారు. ఈ మల్బరీ చెట్లకు కాసే పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. మల్బరీ పండ్లును తినటానికి చాలా మంది ఆసక్తి చూపరు. వీటిని ఎక్కువగా షర్బత్ లు, స్వ్కాష్ లు, జెల్లీలు, సలాడ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు. ఈ పండ్లలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా పోషకాలు ఉన్నాయి. చైనాలో సాంప్రదాయ మూలికా వైద్యంలో గుండె జబ్బులు, మధుమేహం, రక్తహీనత, ఆర్థరైటిస్ చికిత్సలకు మల్బరీలను శతాబ్ధాలుగా ఉపయోగిస్తున్నారు.

మల్బరీ ఆరోగ్య ప్రయోజనాలు ;

మల్బరీలో రెస్వెరట్రాల్ అనే యాంటీయాక్సిడెంట్ అధికంగా ఉండటం వల్ల రక్తపోటు తగ్గించటంలో సహాయ కారిగా పని చేస్తుంది. రెస్వెరట్రాల్ అనే ముఖ్యమైన ఫ్లెవనాయిడ్ రక్త నాళాలల పనితీరులో ప్రత్యక్ష్యంగా ప్రభావితం చేస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని , స్ట్రోక్ ,గుండె పోటు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండ్లను తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్తప్రసరణ బాగా సాగేలా చేయటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

మల్బరీ పండ్లలో పీచు పదార్ధాలు ఉంటాయి. రోజువారి పీచుపదార్ధాల అవసరాలలో 10శాతం ఈ పండ్లను తీసుకోవటం ద్వారా పొందవచ్చు. జీర్ణవ్యవస్ధ మెరుగుపరిచేందుకు మల్బరీ పండ్లు ఉపకరిస్తాయి. మలబద్దకం, ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి వాటిని నివారించటంలో దోహదపడతాయి. మల్బరీ పండ్లలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదం చేయటమే కాకుండా శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేయటంలో సహాయపడుతుంది.

మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది. ఎల్ డిఎల్ గ్రాహక చర్యను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. కొలెస్ట్రాల్ స్ధాయిలను నిరోధించటంలో ఈ పండ్లు ఉపకరిస్తాయి. మల్బరీని ఆహారంలో చేర్చుకోవటం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు తగ్గుతాయని కనుగొన్నారు. అంతేకాకుండా డయాబెటిస్ వల్ల వచ్చే బరువును నియంత్రించటంలో సహాయకారిగా పనిచేస్తాయి.

విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండేలా చేసి మన శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కాలేయానికి మల్బరీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు అమ్లాల ఆక్సీకరణను మెరుగుపరుస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారించటంలో దోహదం చేస్తాయి.

 

ట్రెండింగ్ వార్తలు