Chinmayi: చిన్మయి పరిచయం అక్కర్లేని పేరు.. సింగర్ గాను డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న చిన్మయి.. నిరంతరం మహిళల సమస్యలపై, సమాజంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతూ వారికి అండగా నిలబడుతుంది. ఆపదలో ఉన్న మహిళలకు బాధలో ఉన్న అమ్మాయిలు, విద్యార్థులకు సలహాలు ఇస్తూ.. కొందరు అమ్మాయిలు తాము పడుతున్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా చిన్మయితో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్స్ కూడా చేస్తుంటారు.
Driving Licence: మరో రీమేక్‌పై వెంకీ చూపు.. లైసెన్స్ దక్కేనా?
అలా మరోసారి చిన్మయి ఘాటు కామెంట్స్ చేసింది. ‘తమ కూతురుకు గౌరవంగా జీవించే అవకాశం అస్సలు ఇవ్వరు. తన కాళ్ల మీద తాను నిలబడే స్వేచ్ఛ ఇవ్వరెందుకో అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటాను. కట్నం ఇచ్చి మరీ పెళ్లీ చేస్తారు. కానీ అమ్మాయిలను మాత్రం ఆర్థికంగా, స్వతంత్రంగా బతకనివ్వరు.’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఆర్థికంగా, స్వతంత్రంగా అమ్మాయిలు ఉంటే అవగాహనతో వేరే క్యాస్ట్ వారిని పెళ్లి చేసుకుంటారని భయమని చెప్పారు.
Indian 2: త్రిష కాదు తమ్మూ.. హీరోయిన్ కోసం ఇండియన్ వేట!
అందుకే ఫోర్స్ చేసి.. వెధవైనా పర్లేదు సొంత క్యా స్ట్లో వారినే పెళ్లి చేసుకోవాలి. తర్వాత కొట్టినా, తిట్టినా వాడితోనే కాపురం చేయాలని రాసింది చిన్మయి. ఈ స్టోరీస్ చూసి కొంతమంది అమ్మాయిలైన సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే అది తనకు చాలని చెప్పింది. “అవగాహన కల్పిస్తున్నప్పుడు హిస్టారికల్‌గా చూస్తే కూడా మనుషులకు కోపం వస్తుంది. బాలికల నుంచి సతీ సహగమనం లాంటి చెత్త సాంప్రదాయాలను మార్చేందుకు చూసిన ప్రతిసారీ ఇలాంటి కోపాన్నే ప్రదర్శించారు.. నా మాటలకి కోప్పడే వారి ఈగోలను సాటిస్ఫై చేసి మిమ్మల్ని శాంతింపచేసేందుకు నేను రాలేదు” అని హాట్ కామెంట్స్ చేసింది.. చిన్మయి.