Dirty Fellow : హీరోగా మారిన ఎక్స్ నేవీ సోల్జర్.. ‘డర్టీ ఫెలో’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

ఇటీవలే డర్టీ ఫెలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

EX Navy Solder Turned as Hero with Dirty Fellow Movie Release Date and Trailer Here

Dirty Fellow : శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి హీరో, హీరోయిన్స్ గా, సత్యప్రకాష్, నాగినీడు ముఖ్య పాత్రల్లో ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై GS బాబు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘డర్టీ ఫెలో’. మే 24న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో సంపూర్ణేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ గెస్టులుగా వచ్చారు.

ఈ ఈవెంట్లో హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. హీరో శాంతి చంద్ర నాకు బ్రదర్ లాంటి వాడు. సినిమాకు డర్టీ ఫెలో అనే టైటిల్ ఎందుకు పెట్టారని అడిగితే మరో ఛాయిస్ లేదని డైరెక్టర్ చెప్పారు. శాంతి చంద్ర అన్న హీరోగా వస్తున్న ఈ డర్టీ ఫెలో సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. డర్టీ ఫెలో డైరెక్టర్ ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ.. నేను ఒక చేసే రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకప్పుడు సినిమాలకు శతదినోత్సవాలు చేసేవాళ్ళు, ఇప్పుడు రెండు రోజులకే సినిమా లైఫ్ అయిపోతుంది. పైరసీ వచ్చినా తట్టుకొని సినిమా నిలబడింది. కానీ ఇప్పుడు పైరసీ కాదు ప్రైవసీ జబ్బు వచ్చింది. ఎవరికి వాళ్ళు ఇంట్లోనే హోమ్ థియేటర్, ఓటీటీలో చూస్తున్నారు. సినిమాను థియేటర్ లోనే చూసి చిన్న సినిమాలను బతికించండి లేకపోతే ఒకప్పుడు థియేటర్ లో సినిమాలు వేసేవాళ్ళు అని చెప్పుకోవాల్సి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ.. శాంతి చంద్ర ఎక్స్ సర్వీస్ మెన్. దేశానికి తన సేవలు అందించి ఇప్పుడు సినిమా మీద ప్యాషన్ తో సినిమాలు చేస్తున్నాడు. నేను ఈ సినిమాకు ఒక గైడ్ గా ఉన్నాను. డైరెక్టర్స్ డే ఈవెంట్ వల్ల మూడు రోజులుగా నిద్రలేదు, అయినా ఈ సినిమా ఈవెంట్ కి వచ్చాను. శాంతి చంద్ర ఇండియన్ నేవీలో చేసిన సాహసాలు చెబుతుంటే ఒళ్లు గగుర్పొడిచేది. త్వరలోనే ఆ నేపథ్యంతో సెయిలర్ అనే పాన్ ఇండియా మూవీ కూడా చేయబోతున్నారు అని తెలిపారు.

Also Read : Kannappa Movie Unit : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నప్ప మూవీ టీమ్ ఫొటోలు..

ఇక హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ.. మా సినిమా మేకింగ్ లో గైడ్ చేసి, ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ వీరశంకర్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఇండియన్ నేవీలో చేరాక అక్కడ మేము చేసే సాహసాల టైమ్ లో కూడా కెమెరా నన్ను ఫాలో అవుతుందేమో అనుకునేవాడిని. మంత్ర సినిమాతో సినీ పరిశ్రమకి వచ్చి ఇప్పుడు మళ్ళీ డర్టీ ఫెలోతో వస్తున్నా. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, యాక్షన్, రొమాన్స్ అన్నీ ఈ డర్టీ ఫెలో సినిమాలో ఉన్నాయి. మే 24న రిలీజ్ కాబోతుంది అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు