BBC Documentary: మోదీపై బీబీసీ డాక్యూమెంటరీ లింక్‭ షేర్ చేస్తే బ్లాక్.. సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశాలు

దీంతో కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. అయితే ఇప్పటికే ఈ వీడియోలను చాలా మంది డౌన్‭లోడ్ చేసుకోవడంతో.. ఎవరైనా ఈ వీడియోను షేర్ చేసినా, లేదంటే వీడియో లింకుల్ని షేర్ చేసినా, వాటిని బ్లాక్ చేయాలని సోషల్ మీడియా సంస్థల్ని ప్రభుత్వం ఆదేశించింది. బీబీసీ అధికారిక యూట్యూబ్ నుంచి కూడీ ఈ వీడియోను తొలగించాలని బీబీసీకి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సూచించింది

BBC Documentary: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బ్రిటిష్ బ్రాడ్‭కాస్ట్ (బీబీసీ) తీసిన డ్యాకుమెంటరీ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ డాక్యూమెంటరీకి సంబంధించిన లింకులను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్, యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలకు ఈ విషయమై ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.

Assam CM on Pathaan: షారూఖ్ ఖాన్ ఎవరో కూడా తెలియదట.. పఠాన్ సినిమా వివాదంపై అస్సాం సీఎం కామెంట్స్

‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే పేరుతో బీబీసీ రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. కాగా, ఈ డాక్యూమెంటరీపై భారత ప్రభుత్వం సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని తీవ్రంగా విమర్శించింది.

Siddaramaiah: మోదీ, షా వచ్చినా నన్ను ఆపలేరు.. మాజీ సీఎం సిద్ధరామయ్య ఛాలెంజ్

దీంతో కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. అయితే ఇప్పటికే ఈ వీడియోలను చాలా మంది డౌన్‭లోడ్ చేసుకోవడంతో.. ఎవరైనా ఈ వీడియోను షేర్ చేసినా, లేదంటే వీడియో లింకుల్ని షేర్ చేసినా, వాటిని బ్లాక్ చేయాలని సోషల్ మీడియా సంస్థల్ని ప్రభుత్వం ఆదేశించింది. బీబీసీ అధికారిక యూట్యూబ్ నుంచి కూడీ ఈ వీడియోను తొలగించాలని బీబీసీకి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సూచించింది. ఇక సోషల్ మీడియా వేదికల్లో దీనికి సంబంధించిన లింకులను బ్లాక్ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ట్రెండింగ్ వార్తలు