Rains Lashes Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. తెలంగాణకు రెడ్, హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.(Rains Lashes Hyderabad)

Rains Lashes Hyderabad : హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. గంటకు పైగా వాన దంచికొట్టింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు అవస్థలు పడ్డారు. ఫ్లై ఓవర్ల కింద తలదాచుకున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

Amarnath cloudburst: పదికి చేరిన అమర్‌నాథ్‌ మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని

మరోవైపు ఐదు రోజుల వర్షాల పరిస్థితిపై వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని చెప్పింది. ఈ క్రమంలో తెలంగాణకు శనివారం రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి.

Rains In Telangana : రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు

రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భీకర వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురుస్తాయని హెచ్చరించింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శనివారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయి.(Rains Lashes Hyderabad)

Heavy Rains : హైద‌రాబాద్ లో రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు..రెడ్ అల‌ర్ట్‌ జారీ

జులై 9 ఉదయం 8.30 గంటల నుంచి జూలై 10 ఉదయం వరకు.. కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంది.

జులై 10 ఉదయం నుంచి జులై 11 వరకు.. ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు