Highest Living Elephent : 103 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏనుగు .. వత్సలను వరించనున్న గిన్నిస్‌ రికార్డు

ఓ ఏనుగు వందేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. భూమిపై అత్యధికాలం జీవించిన ఏనుగుగా గిన్నిస్‌లో స్థానం దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. మరి ఆ ఏనుగు ఎక్కడుందో తెలుసా..

Highest Living Elephent In India : ఏనుగు చచ్చినా వెయ్యేళ్లు.. బతికినా వెయ్యేళ్లు అని అంటారు. నిజంగా ఏనుగు వెయ్యేళ్లు బతుకుతుందా? అనే డౌట్‌ మీకెప్పుడైనా వచ్చిందా? అసలు ఏనుగు జీవితకాలం ఎంత? మన ఇండియాలో అత్యధికాలం జీవించిన ఏనుగు ఏది? అనేవి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి…

ఏనుగుల గురించి ఎన్నో కథలున్నాయి. చిన్నారులకు ఏనుగంటే చాలా ఇష్టం. బుద్ధి జీవులైన ఏనుగులు మానవజాతికి ఎంతో సేవ చేస్తున్నాయి. వీటికి తిక్కలేస్తే మాత్రం లెక్కే ఉండదు. మనుషులకు చాలా స్నేహంగా మెలిగే ఏనుగులు వాటి యజమానులు చనిపోతే కన్నీరు పెట్టుకున్న ఘటనల గురించి విన్నాం. ఏనుగు పేరు చెప్పి పిల్లలను ఆడిస్తుంటారు.. కానీ ఏనుగుల గురించి ఎన్నో విశేషాలున్నాయి. కానీ ఏనుగు ఎంతకాలం జీవిస్తుందో తెలియదుకాని.. ఏనుగు వెయ్యేళ్లు బతుకుతుందని అంటారు.కానీ ఏనుగు అన్నేళ్లు జీవించినట్లు ఎక్కడా నిరూపితం కాలేదు. నిజానికి వందేళ్లు జీవించిన ఏనుగుల రికార్డులు కూడా ప్రభుత్వం వద్ద లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఓ ఏనుగు వందేళ్ల రికార్డు (100 Years Record)ను బద్దలు కొట్టింది. భూమిపై అత్యధికాలం జీవించిన ఏనుగుగా గిన్నిస్‌లో స్థానం దక్కించుకునేందుకు ఠీవిగా ఎదురుచూస్తోంది.

Elisabeath Ginnis Record : 1600 లీటర్ల చనుబాలు దానం చేసిన అమ్మ, వేలాది చంటిబిడ్డల కడుపు నింపిన మాతృమూర్తికి దక్కిన గిన్నిస్ అవార్డ్

సహజంగా ఏనుగులు జీవిత కాలం 60 నుంచి 70 ఏళ్లు. జంతుసంరక్షణశాలలు.. ఆలయాల్లో ఉండే ఏనుగులు గరిష్టంగా 40 ఏళ్లకు మించి జీవించలేవని నిపుణుల అభిప్రాయం. కానీ.. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని పన్నా టైగర్‌ రిజర్వు(Madhya Pradesh)లో ఉన్న ఓ ఏనుగు మాత్రం సుమారు 103 ఏళ్లు (103 Years)పూర్తి చేసుకుంది. ఏనుగు సహజ జీవితకాలానికి మించి మూడు దశాబ్దాలు ఆరోగ్యంగా ఉన్న ఈ ముసలి ఐరావతం వాస్తవ వయసు లెక్కించాలని ప్రభుత్వం భావించింది. అన్నట్లు ఈ వృద్ధ ఐరావతం పేరు వత్సల. వృద్ధాప్యం కారణంగా బాగా బక్కిచిక్కిపోయిన వత్సల కచ్చితమైన వయసు తెలుసుకోడానికి అటవీశాఖ అనుమతిచ్చింది. వత్సల డీఎన్‌ఏ సేకరించి మన హైదరాబాద్‌లోనే పరీక్షించనున్నారు.

Diamonds Hunting : రతనాల సీమలో వజ్రాల సిరులు.. తొలకరిలో కోటీశ్వరులవుతున్న సామాన్యులు

ప్రస్తుతం దేశంలో 28 వేల ఏనుగులు ఉంటాయని అంచనా.. ఇందులో 25 శాతం ఏనుగులు కర్ణాటక అడవుల్లోనే ఉన్నాయి. ఒడిశా, తమిళనాడుల్లో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి. ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు చిత్తూరు జిల్లాలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇక ప్రపంచంలో ఏనుగులను రెండు రకాలుగా పిలుస్తుంటారు. ఒకటి అసియా ఏనుగులు.. రెండు ఆఫ్రికన్‌ ఏనుగులు(African elephants). ఆసియా ఏనుగులు అంతరిస్తున్న జీవుల జాబితాలో ఉంటే ఆఫ్రికన్‌ ఏనుగులు ఆసియా ఏనుగుల కన్నా పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఏ ఏనుగూ వందేళ్లు బతికినట్లు ఇప్పటివరకు రికార్డు కాలేదు. ఈ అరుదైన ఘనత సాధించిన రికార్డు వత్సలకే దక్కనుంది. డీఎన్‌ఏ రిపోర్టులో వత్సల వాస్తవ వయసు నిర్ధారించాక గిన్నిస్‌ రికార్డు(Guinness Record)ల్లో నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు.

Elon Musk-Zuckerberg : బీచ్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఎలన్ మస్క్,జుకర్ బర్గ్.. దీనిపై మస్క్ ఏమన్నారంటే..

 

ట్రెండింగ్ వార్తలు