Delhi Budget2023: ఢిల్లీ బడ్జెట్‭కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. హైడ్రామా ముగిసినట్టేనా?

ప్రకటనలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసిన ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ (MHA) కోరింది. అయితే వీటికి సమాధానం ఇస్తూనే బడ్జెట్ ప్రతులను పంపినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది

Delhi Budget: ఢిల్లీకి (Modi govt) ఢిల్లీకి (Kejriwal govt) మధ్య విబేధాలు అదుపులోకి రాకపోగా, మరింత భగ్గుమంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక సందర్భంగా రెండు అధికార పార్టీల మధ్య అటు ఇటుగా నెల రోజుల పాటు తీవ్ర వివాదం కొనసాగింది. మున్సిపల్ కార్యాలయంలోనే ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారంటే వీరి మధ్య పరిస్థితులు ఎంత సున్నితంగా తయారయ్యాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఢిల్లీ బడ్జెట్ (Delhi Budget) విషయంలో ఇరు ప్రభుత్వాల మధ్య వివాదం తలెత్తింది.

Gujarat : డాక్టర్ల నిర్లక్ష్యం, రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని ఆదేశం

ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ఆమోదానికి పంపగా అక్కడే ఆగిపోయింది. దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రజల మీద కోపాన్ని తగ్గించుకోవాలని, బడ్జెట్ ఆపొద్దంటూ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (PM Modi) ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. వాస్తవానికి మంగళవారమే ఢిల్లీ అసెంబ్లీ(Delhi assembly)లో బడ్జెట్ ప్రవేశ పెట్టాలి. కానీ, అది లెఫ్టినెంట్ గవర్నర్ తిరిగి పంపకపోవడంతో మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదని కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. అనంతరం మంగళవారం ఉదయమే ప్రధానికి లేఖ రాశారు.

Mamata Banerjee: కేంద్రంపై పోరు తీవ్రం చేసిన మమతా బెనర్జీ.. రెండు రోజుల ధర్నాలకు సిద్ధం

ప్రకటనలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసిన ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ (MHA) కోరింది. అయితే వీటికి సమాధానం ఇస్తూనే బడ్జెట్ ప్రతులను పంపినట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ నాలుగు రోజుల ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెర దింపింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది.

Rafael Nadal: టాప్-10లో చోటు కోల్పోయిన రఫెల్ నాదల్.. 2005 తర్వాత ఇదే తొలిసారి

ఈ విషయమై హోంమంత్రిత్వ శాఖ సోమవారం స్పందిస్తూ, ప్రతిపాదిత బడ్జెట్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని పరిపాలనపరమైన అంశాలను లేవనెత్తారని తెలిపింది. దేశ రాజధాని నగరం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలను లేవనెత్తారని పేర్కొంది. ఈ అంశాలను పరిష్కరించి బడ్జెట్‌ను తిరిగి పంపించాలని మార్చి 17న రాసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొంది. ఇరు అధికారిక పార్టీల మధ్య ఈ పోరు తగ్గదని స్పష్టమే అయినప్పటికీ.. తాజా పరిణామాలతో బడ్జెట్ కొనసాగిన మీద హైడ్రామా ముగిసినట్లే అనుకోవచ్చని అంటున్నారు. కాగా, ఇలా బడ్జెట్ ఆమోదం తెలపకుండా ఆలస్యం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.

ట్రెండింగ్ వార్తలు