COVID-19 Vaccine Certificate : కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..

కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా? కరోనా వ్యాక్సిన్ మొదటి, రెండో డోసు వ్యాక్సిన్లు వేయించుకున్నారా? అయితే మీరు కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా? కరోనా వ్యాక్సిన్ మొదటి, రెండో డోసు వ్యాక్సిన్లు వేయించుకున్నారా? అయితే మీరు కొవిడ్ వ్యాక్సిన్
సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఈ సర్టిఫికేట్ ను ఎన్నోరకాలుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్, కొవిన్ పొర్టల్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్
చేసుకోవచ్చు.

ఇంతకీ ఈ కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఎందుకు డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. దీనిద్వారా మాత్రమే మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు అనేందుకు రుజువు.. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేయించుకున్నాక రైల్లో, విమానాల్లో, రోడ్డు మార్గాల ప్రయాణ సమయాల్లో తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం పడొచ్చు. మీ స్మార్ట్ ఫోన్లో కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఎన్నిమార్గాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చో ఓసారి ట్రై చేద్దాం..

CoWIN యాప్ ద్వారా డౌన్‌లోడ్ :
– కొవిన్ పొర్టల్ https://selfregistration.cowin.gov.in/ లింక్ ఓపెన్ చేయండి.
– మీ Beneficiary reference ID ఎంటర్ చేయండి.
– Search Option దగ్గర క్లిక్ చేయండి.
– Download Covid Vaccine Certificate ఆప్షన్ క్లిక్ చేయండి.
– మీ స్మార్ట్ ఫోన్లో కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ అయిపోతుంది.
CoWIN యాప్ అందుబాటులో లేకపోతే.. CoWIN పోర్టల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఆరోగ్య సేతు ద్వారా డౌన్ లోడ్ :
గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లో Aarogya Setu యాప్ అందుబాటులో ఉంది.
– యాప్ ను లేటెస్ట్ సాఫ్ట్ వేర్ వెర్షన్‌కు అప్ గ్రేడ్ చేసుకోండి.
– కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
– CoWIN ట్యాబ్ పై క్లిక్ చేయండి.
– వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఆప్షన్ పై Click చేయండి.
– Beneficiary certificate ఎంటర్ చేసి.. వ్యాక్సిన్ నేషన్ సమయంలో ఈ ఐడీ ఇస్తారు.
– Get Certificate బటన్ పై క్లిక్ చేయండి..
– మీ స్మార్ట్ ఫోన్ లో కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోండి.

ట్రెండింగ్ వార్తలు