Children Protect : వర్షాకాలంలో వ్యాధులనుండి పిల్లల రక్షణ ఎలాగంటే!..

ఆహారం తినే ముందు పిల్లలు తమ చేతులను శుభ్రంగా కడుక్కునేలా చూడాలి. ఇలా చేయటం వల్ల చేతుల్లో ఉండే క్రిములు నోటి నుండి లోపలకు వెళ్ళకుండా అడ్డుకట్ట వేయవచ్చు. దోమలు కుట్టకుండా నిద్రసమయంలో

Kids Health

Children Protect : తొలకరి చినుకులు వస్తూనే బ్యాక్టీరియా, వైరస్ లను మోసుకొస్తుంది. వర్షాల కారణంగా వాతావరణంలో తేమ శాతం పెరిగి బ్యాక్టీరియా, వైరస్ లకు అనుకూలంగా మారుతుంది. కలుషిత నీరు, దోమలు ఇలాంటి వాటి వల్ల పిల్లలు ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న వయస్సు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో త్వరగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది.

ఒకవైపు కరోనా మహమ్మారి చిన్నారులను సైతం కబళిస్తున్న నేపధ్యంలో సీజనల్ వ్యాధులు దానికి తోడై గజగజలాడిస్తుండం అందరిలో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. వర్షాకాలంలో పిల్లల విషయంలో పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దోమలు వ్యాప్తి వర్షాల సమయంలో అధికంగా ఉంటుంది. వీటికారణంగా పిల్లలకు డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా,న్యుమోనియా వంటి వ్యాధులు తలెత్తుతాయి. జ్వరం, వాంతు, విరేచనాలు, కడుపునొప్పి వంటి వాటిని పిల్లల్లో గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి మెరుగైన చికిత్స తీసుకోవటం మంచిది.

వర్షాకాలంలో నీరు కలుషితం మయ్యే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. కలుషితమైన నీరు , ఆహారం తీసుకోవటం వల్ల టైఫాయిడ్, డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు వస్తాయి. తడిచిన దుస్తులు ధరించటం వల్ల చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. వర్షంలో తడివాలన్న చిన్నారుల ఉల్లాసం వల్ల జలుబు,దగ్గు వంటి సమస్యలు తలెత్తవచ్చు.

వర్షకాలంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించటం ద్వారా తల్లిదండ్రులు, తమ పిల్లలను ఆనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చు. ఈ కాలంలో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేలా వారికి మంచి పోషకాలతో కూడిన ఆహారం అందించాలి. పాలు , పండ్లు,గుడ్లు, నట్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేయాలి. కూరగాయలు, పండ్లు వాటిని తినేముందు బాగా నీటిలో కడిగి శుభ్రపరిచిన తరువాత తినేందుకు అందించాలి.

ఆహారం తినే ముందు పిల్లలు తమ చేతులను శుభ్రంగా కడుక్కునేలా చూడాలి. ఇలా చేయటం వల్ల చేతుల్లో ఉండే క్రిములు నోటి నుండి లోపలకు వెళ్ళకుండా అడ్డుకట్ట వేయవచ్చు. దోమలు కుట్టకుండా నిద్రసమయంలో వంటిని కప్పి ఉండేలా దుస్తులు ధరించేలా చూడాలి. దోమతెరలు వంటివాటిని వినియోగించటం మంచిది. ఇంట్లో దోమలు నివాసం ఏర్పరుచుకోకుండా చెత్త చెదారాన్ని ఏప్పటికప్పుడు తొలగించాలి. ఆహార పదార్ధాలు ఎక్కవ సమయం నిల్వ ఉన్నవి కాకుండా వేడివేడిగా,తాజా అందించాలి.

మసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్ ,కూల్ డ్రింక్స్, తీపిపదార్ధాలకు దూరంగా ఉంచటం మంచిది. ఇలాంటి వాటిని తీసుకోవటం వల్ల పెద్దగా ఆరోగ్యపరంగా ప్రయోజనం చేకూరకు పోను ఆనారోగ్యసమస్యలకు దారితీసే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. చిన్నచిన్న జబ్బులే కదా అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలను పాటిస్తూ వారికి వైద్యం అందించాలి. స్కూలుకు వెళుతున్న చిన్నారులు మాస్కులు తప్పనిసరిగా ధరించటం, చేతులను శానిటైజ్ చేసుకోవటం, భౌతిక దూరం వంటి వాటిపై అవగాహన కలిగించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు