Ganuga Oil : గానుగ నూనెతో లాభాల బాట..

రాజన్న చదివింది ఎంఏ రూరల్ డెవలప్ మెంట్ .. కొన్నేళ్ల పాటు ఏకలవ్య ఓ స్వచ్చంధ సంస్థలో పనిచేశారు. అయితే తన తల్లి అనారోగ్యానికి గురికావడంతో వైద్యుల సలహాలతో గానుగ నూనెను వంటల్లో వాడేవారు. దీంతో ఆరోగ్యం కుదుట పడటంతో తాను కూడా వివిధ ప్రాంతాలనుండి గానుగ నూనెను కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్మకం ప్రారంభించారు.

Ganuga Oil : మారుతున్న జీవన శైలి,  కోత్త కోత్త రోగాలను పరిచయం చేస్తుంది. రసాయానాలతో పండించిన ఆహర పదార్థలను తినడంతో అనారోగ్యల బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అందుకే ఆరోగ్యం విష‌యంలో చాలా మంది శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం వాడే వంట నూనెల విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

READ ALSO : Castor Bean Crop : ఆముదం పంటకు నష్టం కలిగించే ఎర్రగొంగళి పురుగు, నివారణ చర్యలు

అందులో భాగంగానే రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ‌లో ఆడించిన స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెల‌ను వాడేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే కొమురంభీం ఆసీఫాబద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు సహజ సిద్ధంగా గానుగ నూనె తయారు చేస్తూ.. పలువురికి ఉపాధి కలిపిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మొత్తం 4 యూనిట్లు ఏర్పాటుచేసి  ప్రతిరోజు ఇందులో వేరుశనగ, నువ్వులు, కుసుమ, కొబ్బరి నూనెలను తయారు చేస్తున్నాడు ఎనగందుల రాజన్న. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా, పెంచికల్ పేట్ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన ఈయన.. గానుగ నునెను తయారు చేస్తున్నారు.

READ ALSO : Groundnut Farming : వేరుశనగలో మొవ్వ కుళ్ళు తెగులు , నివారణ

రాజన్న చదివింది ఎంఏ రూరల్ డెవలప్ మెంట్ .. కొన్నేళ్ల పాటు ఏకలవ్య ఓ స్వచ్చంధ సంస్థలో పనిచేశారు. అయితే తన తల్లి అనారోగ్యానికి గురికావడంతో వైద్యుల సలహాలతో గానుగ నూనెను వంటల్లో వాడేవారు. దీంతో ఆరోగ్యం కుదుట పడటంతో తాను కూడా వివిధ ప్రాంతాలనుండి గానుగ నూనెను కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్మకం ప్రారంభించారు.

మంచి లాభాలు వస్తుండటంతో స్వయంగా తయారు చేయాలనుకున్నారు. ఇందుకోసం గానుగనూనె తయారీలో శిక్షణ తీసుకొని కాగజ్ నగర్ మండలం, అందెవెల్లి గ్రామంలో వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని రూ. 20 లక్షల పెట్టుబడితో 2022 లో 4 గానుగ యూనిట్లను ఏర్పాటుచేసి, గానుగ నూనె తయారు చేస్తున్నారు.

READ ALSO : vegetables Cultivation : అర ఎకరంలో 16 రకాల కూరగాయల సాగు.. ఏడాదికి రూ.1 లక్షా 50 వేల ఆదాయం

వచ్చిన నూనెను స్థానికంగా అమ్ముతూనే ఆర్డర్ల పై ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.  గానుగ నూనెలో అధిక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి గానుగ నూనెల గురించి తెలిసిన వారంత ఆ నూనెల కోనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే గానుగల ఏర్పాటుకు ప్రభుత్వం నుండి సహాకారం లభిస్తే యువతకు ఉపాధి దొరకడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారని రైతు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు