Etela Rajender : ఈటల రాజేందర్ ఘన విజయం.. హిస్టరీ రిపీట్స్

ఈటల రాజేందర్ కు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల గెలుపు సాధించడంతో..బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

Huzurabad By Election 2021 : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హుజూరాబాద్ బైపోల్ లో ఈటల రాజేందర్ తిరుగులేని విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి, టీఆర్ఎస్ క్యాండిడేట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు.  2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల గెలుపు సాధించడంతో..బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. తామే విజయం సాధిస్తామని ముందే ఊహించామని ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మంగళవారం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఆది నుంచి..ఈటల ఆధిక్యం కనబరుస్తూ వచ్చారు. తన విజయానికి సహకరించిన వారందరికీ ఈటెల ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏ మాత్రం పోటీనివ్వలేదు. కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీకి చెందిన నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. మొత్తంగా..ఈటెల గెలుపుతో బీజేపీలో ఫుల్ జోష్ నెలకొంది.

Read More : Huzurabad By Poll : 13వ రౌండ్‌‌లో ఈటల ముందంజ…ఏ రౌండ్‌‌లో ఎన్ని ఓట్లు

ఇక ఈటల రాజేందర్ హిస్టరీ విషయానికి వస్తే…

2004 సంవత్సరంలో కమలాపూర్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పోటీ చేయగా…68, 393 ఓట్లు సాధించగా..ప్రత్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డికి 48 వేల 774 ఓట్లు సాధించారు. మొత్తంగా ఈటల 19, 619 ఓట్లతో గెలుపొందారు. 2008 సంవత్సరంలో ఎన్నిక జరగగా…కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఈటెల రాజేందర్ బరిలో నిలిచారు. ఇక్కడ 54 వేల 092 ఓట్లు సాధించగా…మరలా ముద్దసాని దామోదర్ రెడ్డి 31 వేల 808 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా 22 వేల 284 ఓట్లలో గెలుపొందారు. 2009లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటెలరాజేందర్ బరిలోకి దిగారు. కృష్ణమోహన్ వకులాభరణంపై గెలుపొందారు. 56 వేల 752 ఓట్లు సాధించారు ఈటల. కృష్ణమోహన్ వకులా భరణం 41 వేల 717 ఓట్లు సాధించారు. 15,035 ఓట్ల మెజార్టీ సాధించారు ఈటల.

Read More : Huzurabad By Poll : విజయం ముందే ఊహించాం – బండి సంజయ్

ఇక 2010 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే మరోసారి ఈటెల రాజేందర్ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఈటలకు 93 వేల 026 ఓట్లు రాగా…ముద్దసానికి 13 వేల 799 ఓట్లు వచ్చాయి. 79 వేల 227 భారీ మెజార్టీతో గెలుపొందారు. 2014 సంవత్సరంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో ఈటెల రాజేందర్ బరిలోకి దిగి.. 95 వేల 315 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డికి 38 వేల 278 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా ఈటల 57 వేల 037 మెజార్టీ సాధించారు.

Read More : Huzurabad By Poll : శాలపల్లి ఓటర్లు బీజేపీ వైపు, రసవత్తరంగా ఉప ఎన్నికల ఫలితాలు

2018 లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ 1,04,840 ఓట్లు సాధించి..సమీప ప్రత్యర్థి  కౌశిక్ రెడ్డిపై గెలుపొందారు. కౌశిక్ రెడ్డికి 61 వేల 121 ఓట్లు వచ్చాయి. 43 వేల 719 ఓట్ల మెజార్టీ సాధించారు ఈటల. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై గెలుపొందారు.

ట్రెండింగ్ వార్తలు