Ichthyosis Disease : చలికాలంలో వేధించే ఇక్తియోసిస్ వ్యాధి..

ప్రతిరోజు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆలివ్‌ అయిల్‌, లిక్విడ్‌ పరాఫిన్‌ లాంటి ఒంటికి రాసుకొని... బాగా మర్దన చేసుకొని, తర్వాత స్నానం చేస్తే మంచిది.

Ichthyosis Disease : చలికాలం వచ్చిందంటే చాలా మంది భయపడిపోతుంటారు. ఎందుకంటే అనేక వ్యాదులు ఈ కాలంలో మనిషిని చుట్టుముట్టేస్తుంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఇక్తియోసిస్ అనే చర్మ వ్యాధితో చాలా మంది బాధపడుతుంటారు. ఈ కాలంలో ఇలాంటి వారి చర్మం బిగుతుగా మారిపోతుంది. బీటలు వారిపోతుంది. చలికాలంలో వాతావరణంలో తేమ తగ్గుటంతో శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో చర్మ పొడిబారిపోతుంది.

ఇక్తియోసిస్ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. ద్రవప్రదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చర్మం తేమగా ఉండటానికి తోడ్పడతాయి. ఉదయం, సాయంత్రం చర్మాన్ని మాయిశ్ఛరైజర్లు రాసుకోవాలి. పెట్రోలియం జెల్లీ లేదా వాజెలీన్‌ కూడా రాసుకోవచ్చు. ఇవి చర్మంలోంచి తేమ బయటకు వెళ్లిపోకుండా కాపాడతాయి. వీటిని క్రమం తప్పకుండా వాడుకుంటుంటే చర్మం పొడిబారటం, బీటలు పడటం తగ్గుతాయి.

ప్రతిరోజు నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆలివ్‌ అయిల్‌, లిక్విడ్‌ పరాఫిన్‌ లాంటి ఒంటికి రాసుకొని బాగా మర్దన చేసుకొని, తర్వాత స్నానం చేస్తే మంచిది. దీంతో చర్మం మృదువుగా అవుతుంది. స్నానం చేసేటప్పుడు మాయిశ్చరైజర్‌తో కూడిన సబ్బులు వాడుకోవాలి. ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. వీలైనంత వరకు నూలు దుస్తులు ధరించాలి. కొందరికి ఐసోట్రెటినాయిన్‌ 20 ఎంజీ మాత్రలు ఉపయోగపడతాయి. వైద్యుని సలహాతో వాడుకోవాలి. వీటితో చర్మం పొడిబారటం తగ్గుతుంది గానీ దీర్షకాలం వేసుకోవటం తగదు. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందటం మేలు.

 

ట్రెండింగ్ వార్తలు