Kalyan Ram announces Bimbisara prequel
వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసార. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన, వశిష్ఠ తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు.
అయితే.. ఈ సినిమాకి సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్‌ను చేయనున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా బింబిసార ప్రీక్వెల్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే.. ఈ మూవీ బింబిసార డైరెక్ట్ చేసిన వశిష్ఠ కాకుండా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
Raj Tarun : హీరో రాజ్‌తరుణ్‌పై పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు..
??? ????? ?? ??????? ??? ?????? ?? ? ?????? ??? ????? ??????????? ???? ?????? ????????? ?#NKR22 – A PREQUEL to the blockbuster #Bimbisara ❤️?
Happy Birthday, @NANDAMURIKALYAN ✨
Exciting updates soon!… pic.twitter.com/yXEKzfVqRa
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2024
త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసార కంటే కొన్నేళ్ల ముందు పరిపాలించిన చక్రవర్తి ఇతివృత్తంతో ఈ సినిమా ఉండనున్నట్లు చెప్పింది. బింబిసారునికి పూర్వం త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన ఒక పురాణగాధను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 22వ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా NKR22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందించనున్నారు.