Heart Health Foods : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అద్భుతమైన 5 ఆహారాలివే..!

Heart Health Foods : ఆరోగ్యకరమైన గుండె కోసం మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన వేసవి ఆహారాల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

Heart Health Foods : వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే.. జీవనశైలి మార్చుకోవడంతో పాటు అత్యంత పోషకాలు కలిగిన పదార్థాలను తీసుకుంటుండాలి. ప్రస్తుతం పెరుగుతున్న వేడి కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావితం చూపిస్తుంది. హీట్ ఎక్స్పోజర్ కూడా గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. హీట్ స్ట్రోక్, అలసట వంటి అనే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, మీ గుండె ఆరోగ్యానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

Read Also : Stress Physical Health : ఒత్తిడితో హైబీపీ, అజీర్ణం సమస్యలు.. మీ శారీరక ఆరోగ్యంపై ఎంతలా ప్రభావం చూపిస్తుందంటే?

వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరుస్తుంది. మొత్తం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిలోని అనేక ముఖ్యమైన పోషకాలు గుండె సరిగా పనిచేయడంలో సాయపడతాయి. గుండె జబ్బుల మొత్తం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సాయపడతాయి. ఆరోగ్యకరమైన గుండె కోసం మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన వేసవి ఆహారాల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

గుండె ఆరోగ్యానికి వేసవి ఆహారాలివే :

1. బెర్రీలు : బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సాయపడతాయి. రాస్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్‌లో ముఖ్యంగా కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది.

2. మామిడి :
వేసవి సీజన్‌లో అత్యంత ఇష్టపడే పండు మామిడి.. ఈ పండుతో గుండె ఆరోగ్యాన్ని పొందవచ్చు. అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది. మామిడిలో మెగ్నీషియం, పొటాషియం ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు సాయపడుతుంది. లో-బీపీ సమస్యను తగ్గించగలదు. మామిడిపండ్లు తినడం ద్వారా మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సాయపడతాయి.

3. పుచ్చకాయ :
పుచ్చకాయలోని అనేక పోషకాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు కూడా తగ్గుతుంది. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, బి6, విటమిన్ సి వంటి పోషకాలు మొత్తం గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సాయపడతాయి.

4. బొప్పాయి :
బొప్పాయిలో విటమిన్ సి, లైకోపీన్ బెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు. బొప్పాయి తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంచడంలో సాయపడుతుంది.

5. దోసకాయ :
దోసకాయలను వేసవిలో హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో కూడి ఉంటాయి. హృదయ ఆరోగ్యాన్ని పెంచడంలో అద్భుతంగా సాయపడతాయి.

Note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగా వైద్యున్ని సంప్రదించి ఆ తర్వాతే ఈ ఆహారాలను తీసుకోవడం ఎంతో ఉత్తమం. 

Read Also : World Health Day : మీకు ప్రీ-డయాబెటిస్‌ ఉందని తెలుసా? కంట్రోల్ చేయకుండా వదిలేయవద్దు.. వైద్యుల హెచ్చరిక..!

ట్రెండింగ్ వార్తలు