Independence Day: మొబైల్ కవర్‭పై జాతీయ జెండా ఉంటే జైలుకే.. జాతీయ జెండాకు పాటింల్సించాల్సిన రూల్స్ ఏంటంటే?

2002కి ముందు, మీరు స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేశంలోని ప్రజలంతా తమ తమ స్టైల్లో స్వాతంత్ర్య వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, అవగాహనా లోపం కారణంగా జాతీయ జెండాకు అగౌరవం కలిగించే విధంగా కొందరు ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి ఇవి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. కేసులు, శిక్షల వరకు వెళ్తాయి. ఇవే కదా అనుకునే పనులు కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఉదహారణకి మొబైల్ కవర్ అనేది భిన్న రీతుల్లో రంగుల్లో ఉండడం కామన్. అయితే కొందరు దీన్ని జాతీయ జెండాతో కప్పేస్తారు. అయితే ఇది శిక్షార్హం అనే విషయం తెలుసా?

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసారం కోసం ఎన్ని కెమెరాలు వాడుతున్నారో తెలుసా?

ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం, మీరు ఉద్దేశపూర్వకంగా జెండాను నేలకు తాకనివ్వకూడదు. అలాగే విసిరివేయకూడదు. మీరు త్రివర్ణ పతాకం ఉన్న ఫోన్ కవర్ వాడకపోవడమే మంచిది. ఎందుకంటే, ఫోన్‌ను నేలపై ఉంచినప్పుడు జెండా నేలను తాకుతున్నట్లే. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే, మీ కవర్ పాడైపోయినప్పుడు లేదా మురికిగా ఉన్నప్పుడు, మీరు ఆలోచించకుండా దాన్ని విసిరివేస్తారు. అది కూడా నేరమే. అందువల్ల, మీరు మీ ఫోన్ కవర్‌పై జెండాను ఉపయోగిస్తే, అది జెండాకు అవమానంగా పరిగణించబడుతుంది. ఇండియన్ ఫ్లాగ్ కోడ్ నిబంధనల ప్రకారం, ఎవరైనా భారతీయ జెండాను అగౌరవపరిచినట్లయితే, వారికి మూడేళ్ల శిక్ష లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ రెండూ పడతాయి.

ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎలా ఎగురవేయాలి?
2002కి ముందు, మీరు స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు. అయితే, దీని కోసం మీరు కొన్ని నియమాలను పాటించాలి. ఈ నిబంధనలన్నీ ఇండియన్ ఫ్లాగ్ కోడ్‌లో ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002లోని పార్ట్-II పేరా 2.2లోని క్లాజ్ (11)లో, ఒక వ్యక్తి తన ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనుకుంటే, అతను ఉదయం నుంచి రాత్రి అయ్యే వరకు ఎప్పుడైనా ఎగురవేయవచ్చు. కానీ, జెండాను ఎగురవేసేటప్పుడు, జెండా ఎట్టి పరిస్థితుల్లోనూ చిరిగిపోకుండా అగౌరవం కాకుండా చూసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు