దుర్గం చెరువు వద్ద ఇళ్ల నిర్మాణాలపై పూర్తి వివరాలు బయటపెట్టిన కాలనీ వాసులు

ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న తమను 30 రోజుల్లో ఖాళీ చేయాలని ఎలా చెబుతారని నిలదీశారు.

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద నిర్మాణాలపై హైడ్రా నోటీసులు ఇవ్వడంతో దీనిపై అమర్‌ సొసైటీ సభ్యులు ఇవాళ మీడియా సమావేశలో మాట్లాడారు. దుర్గం చెరువు అమర్ సొసైటీ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ… 1991లో లే ఔట్ అప్రూవల్ అయ్యిందని, 140 ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు.

జీహెచ్ఎంసీ అన్ని అనుమతులు ఇచ్చిందని, అంతేగాక, తాము రిజిస్ట్రేషన్లు చేసుకుని రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్నామని, 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫ్లాట్స్ ఎప్టీఎల్ పరిధిలోకి రాదని చెప్పిందని అన్నారు. ప్రభుత్వాలు మారితే ఆధారాలు, భూమి సంబంధించిన కాగితాలు మారవని చెప్పారు.

తాము అనుమతి తీసుకుంది 1991లో అని, అప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంశాలు లేవని గోపాల్ రెడ్డి అన్నారు. అప్పట్లో దుర్గం చెరువు ఎంత ఉండేదో, ఇప్పుడు ఎంత ఉందో అన్ని వివరాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. 30 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న తమను 30 రోజుల్లో ఖాళీ చేయాలని ఎలా చెబుతారని నిలదీశారు.

వాల్టా చట్టం రాక ముందే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. 1974లో డాక్యుమెంట్స్ ప్రకారం దుర్గం చెరువు 65 ఎకరాలు 90 గుంటలు అని వివరింవచారు. ప్రస్తుతం దుర్గం చెరువు 101 ఎకరాలు ఉందని, విస్తీర్ణం ప్రస్తుతం పెరిగిందని తెలిపారు. దుర్గం చెరువు ఎప్టీఎల్ పరిధి తమ కాలనీకి వర్తించదన, చెరువు ఆయకట్టు184 ఎకరాలని, అన్ని వివరాలు బహిర్గతం చెయ్యడం లేదని చెప్పారు.

ఎక్కడా తమ అమర్ సొసైటీ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించలేదని గోపాల్ రెడ్డి తెలిపారు. తమ సోసైటీలో ఉన్న 40 మంది సభ్యులకు నోటీసులు వచ్చాయని, తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించామని చెప్పారు. కోర్టు రెవెన్యూ అధికారులను రిప్లై ఇవ్వాలని మందలించిందని అన్నారు. కొంతమందికి మాత్రమే నోటీసులు వచ్చాయని, న్యాయవ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని తెలిపారు.

Also Read: ‘యాక్సిడెంట్ కాదు.. ఆత్మహత్యాయత్నం అని చెప్పు’ అని మాధురికి చెప్పిన దువ్వాడ శ్రీనివాస్.. ఆడియో లీక్

ట్రెండింగ్ వార్తలు