‘యాక్సిడెంట్ కాదు.. ఆత్మహత్యాయత్నం అని చెప్పు’ అని మాధురికి చెప్పిన దువ్వాడ శ్రీనివాస్.. ఆడియో లీక్

రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించేందుకు ఫోన్‌లో మాధురితో..

‘యాక్సిడెంట్ కాదు.. ఆత్మహత్యాయత్నం అని చెప్పు’ అని మాధురికి చెప్పిన దువ్వాడ శ్రీనివాస్.. ఆడియో లీక్

Updated On : August 31, 2024 / 6:28 PM IST

Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవ వ్యవహారంలో మరో ట్విస్ట్. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం బట్టబయలైంది. మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆయన భార్య వాణి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈ గొడవల నడుమ మాధురికి యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో అది యాక్సిడెంట్ కాదని ఆత్మహత్యాయత్నం చేశానని అప్పట్లో మాధురి తెలిపింది. అయితే, అదంతా నాటకమని బట్టబయలైంది. యాక్సిడెంట్లో గాయాలైతే అది ఆత్మహత్యాయత్నంగా చెప్పాలని మాధురిని దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పారు. ఈ ఆడియో లీక్ అయింది.

రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించేందుకు ఫోన్‌లో మాధురితో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడాడు. మనస్తాపంతో తానే ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు మీడియాతో చెప్పాలని మాధురితో దువ్వాడ శ్రీనివాస్ చెప్పినట్లు ఆడియోలో స్పష్టంగా వినపడుతోంది. దువ్వాడ వాణి వల్లే తాను చనిపోతున్నానని మీడియా ముందు చెప్పాలని దువ్వాడ మాధురితో ఫోన్ లో దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకున్నా కూడా సీసీ ఫుటేజ్ ను బయట పెట్టడంలో విఫలమయ్యారు పోలీసులు.

Also Read: జస్టిస్ హేమ కమిటీ రిపోర్టుపై మోహన్‌లాల్‌ కీలక వ్యాఖ్యలు.. వారికి శిక్ష తప్పదని వార్నింగ్