DPL : 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు.. ర‌విశాస్త్రి, యువరాజ్ త‌రువాత అత‌డే..

ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Priyansh Arya Smashes 6 Sixes In An Over During Delhi Premier League 2024 Clash

Delhi Premier League : ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక ఓవ‌ర్‌లోని ఆరు బంతుల‌ను సిక్స‌ర్లుగా మలిచాడు ప్రియాంష్ ఆర్య. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్, నార్త్ ఢిల్లీ మధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ త‌రుపున ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన ప్రియాంష్ ఆర్య చెల‌రేగి ఆడాడు. 50 బంతుల‌ను ఎదుర్కొన్న అత‌డు 10 ఫోర్లు, 10 సిక్స‌ర్లు బాది 120 ప‌రుగులు సాధించాడు. సిన్న‌ర్ మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ వేసిన 12 ఓవ‌ర్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. ఈ ఓవ‌రులోని ఆరు బంతుల‌ను సిక్స‌ర్లుగా మ‌లిచి 36 ప‌రుగులు సాధించాడు.

Glenn Maxwell : అరెరె.. మాక్స్‌వెల్ ది ప‌ళ్ల సెట్టా..? సీక్రెట్ బ‌య‌ట పెట్టిన మిచెల్ మార్ష్‌..

ఈ క్ర‌మంలో ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాదిన మూడో భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. దేశ‌వాలీ క్రికెట్‌లో రవిశాస్త్రి, అంత‌ర్జాతీయ క్రికెట్‌లో యువరాజ్ సింగ్‌ల ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు బాదిన సంగ‌తి తెలిసిందే.

ఆర్య‌తో పాటు కెప్టెన్ బ‌దోని పెను విధ్వంసం సృష్టించాడు. 55 బంతులు ఎదుర్కొన్న బ‌దోని 8 ఫోర్లు, 19 సిక్స‌ర్ల‌తో 165 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 308 ప‌రుగులు చేసింది. మ‌రికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ మెగా వేలం జ‌రగ‌నుంది. ఈ క్ర‌మంలో వేలంలో ప్రియాంష్ ఆర్య కు మంచి ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉంది.

Shreyas Iyer : నువ్వు సూప‌ర్ అయ్య‌ర్.. జ‌ట్టులో వేరే వాళ్ల‌కి ఛాన్స్ ఇచ్చేందుకు ఇంత‌లా క‌ష్ట‌ప‌డుతున్నావా?

ట్రెండింగ్ వార్తలు