ktr challenge to bjp : బీజేపీకి కేటీఆర్ సవాల్..రాసి పెట్టుకోండి..నా లెక్కలు తప్పైతే మంత్రి పదివికి రాజీనామా చేస్తా

బీజేపీకి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘రాసి పెట్టుకోండి..నా లెక్కలు తప్పైతే మంత్రి పదివికి రాజీనామా చేస్తా..’అంటూ సవాల్ విసిరారు..

ktr challenge to bjp : బీజేపీకి కేటీఆర్ సవాల్..రాసి పెట్టుకోండి..నా లెక్కలు తప్పైతే మంత్రి పదివికి రాజీనామా చేస్తా : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని? తెలంగాణ నుంచి కేంద్రానికి చెల్లించిన పన్నులు ఎన్ని? ఇప్పుడు ఇదే అంశంపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నేతలకు..ఇటు తెలంగాణ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీంట్లో భాగంగానే మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కేంద్రానికి తెలంగాణ కట్టిన పన్నులు..కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు గురించి లెక్కలు వెల్లడించారు. ఈసందర్భంగా తను చెప్పిన లెక్కలు తప్పు అని నిరూపిస్తే తన మంత్రి పదవికి ఎడమకాలి చెప్పులా తీసి పారేస్తానంటూ వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్..

Also read : PM Modi: ఈరోజు రాత్రి 9.30గంటలకు ఎర్రకోట వేదికగా మోడీ ప్రసంగం .. ఇందుకు ఓ కారణముందట..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ స‌వాలు విసిరారు. ఎవ‌రి సొమ్ము ఎవ‌రు తింటున్నారంటూ బీజేపీపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రానికి తెలంగాణ నుంచే ఎక్కువ నిధులు వెళుతున్నాయ‌ని, కేంద్రం నుంచి మాత్రం తెలంగాణ‌కు చాలా త‌క్కువ మోతాదులోనే నిధులు వ‌స్తున్నాయ‌ని ఆయన అన్నారు. తాను చెప్పేది త‌ప్పయితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాన‌ని కేటీఆర్ సవాల్ విసిరారు.

కేంద్రానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా రూ.3, 65,797 కోట్లు ఇస్తే… అదే స‌మ‌యంలో కేంద్రం నుంచి తెలంగాణ‌కు వ‌చ్చింది కేవ‌లం రూ.1,68,647 కోట్లేన‌ని కేటీఆర్ చెప్పారు. ఈ మాట త‌ప్పయితే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పిన కేటీఆర్‌…త‌న మాట‌ను త‌ప్పుగా నిరూపిస్తే ఎడ‌మ కాలికి ఉన్న చెప్పులా మంత్రి ప‌ద‌విని వ‌దిలేస్తాన‌ని అన్నారు.

Also read : Congress Party: ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌లో చర్చ.. 72గంటల్లో తుది నివేదిక..

మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాక సాధార‌ణ ఎమ్మెల్యేగానే తాను కొన‌సాగుతాన‌ని కేటీఆర్ అన్నారు. ద‌మ్ముంటే బీజేపీ నేత‌లు త‌న వ్యాఖ్య‌లు త‌ప్ప‌ని నిరూపించాల‌ని ఆయ‌న బీజేపీకి స‌వాల్ విసిరారు. తెలంగాణ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌లుగురు బీజేపీ ఎంపీలు ఏనాడైనా ప్ర‌ధానిని క‌లిశారా? అని కూడా కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ట్రెండింగ్ వార్తలు