India Covid : ఢిల్లీలో వీకెండ్..అస్సాంలో నైట్ కర్ఫ్యూ..కర్ణాటకలో వైన్స్ క్లోజ్

మొత్తం 55 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిత్యావసర షాపులు, అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని షాపులు, మార్కెట్లు మూసేశారు...

India Covid Update : ఢిల్లీలో వారాంతపు లాక్‌డౌన్‌ మొదలైంది. 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం రాత్రి 10గంటల నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 55 గంటలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిత్యావసర షాపులు, అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని షాపులు, మార్కెట్లు మూసేశారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే ఈ-పాస్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అంతర్ రాష్ట్ర బస్ టెర్మినళ్లకు వచ్చేవారిని వారి టికెట్ల ఆధారంగా అనుమతిస్తున్నారు. మరోవైపు… ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 17వేల 335 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More : Groom Escaped : పెళ్లి ముహూర్తం సమయానికి వరుడు పరార్

కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూ అమలవుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు మొదలైన కర్ఫ్యూ.. సోమవారం ఉదయం 5 గంటల వరకూ కొనసాగనుంది. కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసర సేవలు, నిత్యావసరాలు మినహా అన్నీ క్లోజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరి అవసరాలు ఉంటేనే జనం బయటకు రావాలని సూచించింది. కర్ఫ్యూ అమలులో ఉన్నపుడు లిక్కర్‌‌ సేల్స్‌ను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. ఎక్కడా లిక్కర్ షాపులు ఓపెన్ చేయనీయకుండా, సేల్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read More : Palwancha Issue : వనమా రాఘవేంద్ర అరెస్టు…టీఆర్ఎస్ నుంచి సస్పెండ్

కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అస్సాం సీఎం హేమంత బిశ్వశ‌ర్మ కొత్త నిబంధ‌న‌ల‌ను ప్రక‌టించారు. రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తయిన వారికి మాత్రమే.. హోట‌ళ్లు, రెస్టారెంట్లు, గ‌వ‌ర్నమెంట్ ఆఫీసులు, షాపింగ్ మాల్స్‌, మ‌ల్టీప్లెక్సుల్లోకి అనుమ‌తి క‌ల్పించ‌నున్నట్లు వెల్లడించారు. ఇక.. 2022, జనవరి 08వ తేదీ శనివారంనుంచి రాత్రి పూట క‌ర్ఫ్యూను అమ‌లు చేయ‌నున్నట్లు చెప్పారు. ఈనెల 30 వ‌ర‌కు భౌతికంగా క్లాసులు నిర్వహించ‌రాదని ఆదేశించారు అస్సాం సీఎం.

ట్రెండింగ్ వార్తలు