U 19C WC 2022 : అదరగొట్టిన యువభారత్, ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

పెవిలియన్‌ బాట పట్టినప్పటికీ కెప్టెన్‌ యశ్‌ ధూల్‌, వైస్‌ కెప్టెన్‌, ఆంధ్రా కుర్రాడు షేక్‌ రషీద్‌ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించి తర్వాత చెలరేగి ఆడారు...

India U19 Beat Australia : అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొట్టంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను 96 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. యాంటిగ్వా వేదికగా జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ఆదిలోనే తడబాటుకు గురైన యువ భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ 6, హర్నూర్ సింగ్‌ 16 తక్కువ పరుగులకే పెవిలియన్‌ బాట పట్టినప్పటికీ కెప్టెన్‌ యశ్‌ ధూల్‌, వైస్‌ కెప్టెన్‌, ఆంధ్రా కుర్రాడు షేక్‌ రషీద్‌ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించి తర్వాత చెలరేగి ఆడారు.

Read More : Up Election 2022 : అఖిలేశ్ పార్టీకి టీఎంసీ మద్దతు ..

మూడో వికెట్‌కు వీరిద్దరూ 204 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ యష్‌ధూల్‌ 110 పరుగులతో అద్భుతమైన శతకం బాదాడు. అనంతరం 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. మూడు పరుగులకే తొలి వికెట్‌ సమర్పించుకున్న ఆస్ట్రేలియా ఏ దశలోనూ దాటిగా ఆడలేకపోయింది. కోరె మిల్లర్ (38), క్యాంప్ బెల్ (30) రాణించారు. వీరిని రఘువంశీ విడగొట్టాడు. దీంతో 71 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్ గా క్యాంప్ బెల్ ఔటయ్యాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ బ్యాట్ మెన్స్ పరుగులు సాధించడానికి అష్టకష్టాలు పడ్డారు.

Read More : Srivalli Song : పుష్ప , శ్రీవల్లీలని అచ్చు దింపేసిన బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, హీరోయిన్

క్రమం తప్పకుండా భారత బౌలర్లు వికెట్లు తీస్తూ కంగారూలపై ఒత్తిడి తీసుకొచ్చిన బౌలర్లు 96 పరుగులతో టీమిండియాను ఫైనల్‌కు చేర్చారు. భారత బౌలర్లలో ఓస్వాల్ మూడు, నిషాంత్ సింధు, రవికుమార్ లు తలో రెండు వికెట్లు తీశారు. సెంచరీ సాధించి కీలక పాత్ర పోషించిన కెప్టెన్ యశ్ ధూల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు.

ట్రెండింగ్ వార్తలు