Parliament Meetings: లతా మంగేష్కర్ కు పార్లమెంటులో నివాళి

భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించనున్నాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడనున్నాయి.

Parliament Meetings: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఆరో రోజు పార్లమెంట్ సమావేశాల్లో పలు అంశాలపై ఉభయసభలు ప్రసంగించనున్నాయి. భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించనున్నాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడనున్నాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఉదయం 10 గంటలకు రాజ్యసభలో లతా మంగేష్కర్ సంస్మరణ సందేశం చదవనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా సంస్మరణ సందేశం చదవనున్నారు.

Also read: SAGY List: ఆదర్శ గ్రామాల జాబితాలో 10లో 7 తెలంగాణవే, ఏఏ గ్రామాలంటే!

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు. ఫిబ్రవరి 3న యూపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఢిల్లీ వస్తుండగా హాపూర్ జిల్లాలోని పీఎస్ పిల్ఖువా పరిధిలో అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈక్రమంలో అసదుద్దీన్ కు జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటన చేయగా..అసదుద్దీన్ ఒవైసీ తిరస్కరించారు. అసదుద్దీన్ పై కాల్పులకు తెగబడిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈఘటనకు సంబంధించి సోమవారం ఉదయం 11:10 గంటలకు రాజ్యసభలో, సాయంత్రం 4:10 గంటలకు లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయనున్నారు.

Also read: Swami Paripurnananda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలసర్పం మధ్య చిక్కుకుంది: పరిపూర్ణానంద

ట్రెండింగ్ వార్తలు