Mobile Refueling Units : భారత్ ఫస్ట్ మొబైల్ CNG రిఫీల్లింగ్ యూనిట్లు.. ఇక ఇంటివద్దనే నింపుకోవచ్చు!

భారత్‌లో మొట్టమొదటి CNG రిఫీల్లింగ్ యూనిట్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యూనిట్లను ప్రారంభించారు. టైప్-4 CNG కంపోజిట్ సిలిండర్లను ఢిల్లీ, ముంబై నగరాల్లో ఏర్పాటు చేశారు.

India’s first mobile CNG refuelling units : భారత్ మొట్టమొదటి CNG రిఫీల్లింగ్ యూనిట్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యూనిట్లను ప్రారంభించారు. టైప్-4 CNG కంపోజిట్ సిలిండర్లను ఢిల్లీ, ముంబై నగరాల్లో ఏర్పాటు చేశారు. MRUను ఇంద్రప్రస్థ గ్యాస్ (IGL), మహానగర్ గ్యాస్ అభివృద్ధి చేశాయి. COVID-19 మహమ్మారి సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ దేశవ్యాప్తంగా 201 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) స్టేషన్లను ప్రారంభించారు. మొబైల్ ఇంధన రిటైలింగ్ ప్రయోజనాలను ఆయన వివరించారు. ఇందులో తక్కువ ఖర్చు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, ఇతర ప్రదేశాలలో కస్టమర్లను చేరుకోగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.

ఎనర్జీ రిటైలింగ్‌లో కొత్తదనాన్ని తీసుకొచ్చి మొబైల్‌ యూనిట్లతో ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నామని ప్రధాన్ చెప్పారు. సాంప్రదాయ సిఎన్‌జి స్టేషన్లను ఏర్పాటు చేయడానికి పైప్‌లైన్ల ద్వారా సిఎన్‌జి సరఫరాను సాధించడానికి ఎంఆర్‌యు సహాయం చేస్తుందని ఆయన అన్నారు. MRU ముఖ్య ఫీచర్లపై ఆయన ప్రస్తావిస్తూ.. CNG ఇంధన సదుపాయం ఇప్పుడు కస్టమర్ ఇంటి వద్దనే లభిస్తుందన్నారు. జనవరి 23, 2021న సహజ వాయువు రంగంలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై నేషనల్ కాన్క్లేవ్ సందర్భంగా IGL మొదటిసారి MRU మోడల్‌ను ప్రదర్శించిందని గార్గ్ చెప్పారు.

పెట్రోలియం, పేలుడు భద్రతా సంస్థతో సహా అన్ని వాటాదారుల నుండి ఇన్‌పుట్లను తీసుకొని, ఐజిఎల్ అభివృద్ధి చేయడం ప్రారంభించగా.. మొదటి మోడల్ ను PESO ఆమోదించింది. ఐజిఎల్ అభివృద్ధి చేసిన MRUలో 55 తేలికపాటి టైప్ IV సిలిండర్లు అమర్చారు. 1,500 కిలోల CNG వరకు నిల్వ చేయగలవని, రోజులో 150-200 వాహనాలను నింపుకోవచ్చునని అన్నారు. ప్రకృతి వాయువు వినియోగానికి సిటీ గ్యాస్ పంపిణీ రంగం ప్రధాన రంగంగా అవతరించిందని ప్రధాన్ అన్నారు. తక్కువ ఉద్గారాలను నిర్ధారించడానికి డీజిల్ లేదా పెట్రోల్ వాహనాలను సహజ వాయువుగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు