Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు

సినిమాలో హీరోలా తనని తాను ఊహించుకుంటూ ఓ 15 ఏళ్ల బాలుడు ఒకేసారి ప్యాకెట్ సిగరెట్స్ కాల్చి చివరకు ఆసుపత్రి పాలైన ఘటన.. హైదరాబాద్ లో వెలుగు చూసింది.

Kgf

Boy smokes Packet cigarettes: కొత్త తరం సినిమాలు చిన్నారులపై ఎంతలా ప్రభావం చూపుతున్నాయి తెలిపే ఘటన ఇది. సినిమా హీరోల స్థానంలో తమను తాము ఊహించుకుంటూ తెలిసీతెలియని వయసులో చిన్నారులు పక్కదారి పడుతున్నారు. సినిమాలో హీరోలా తనని తాను ఊహించుకుంటూ ఓ 15 ఏళ్ల బాలుడు ఒకేసారి ప్యాకెట్ సిగరెట్స్ కాల్చి చివరకు ఆసుపత్రి పాలైన ఘటన.. హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన కేజీఎఫ్ 2 సినిమాను వెంట వెంటనే చూసిన 15 ఏళ్ల బాలుడు..అందులో హీరో క్యారెక్టర్ ‘రాకీ భాయ్’ను ఆదర్శంగా తీసుకుని..హీరో స్థానంలో తనను తాను ఊహించుకుంటూ ఒకేసారి ప్యాకెట్ సిగరెట్లను(ఒకదాని తరువాత ఒకటి) కాల్చాడు.

other stories: Andhra University Campus : 10టీవీ ఎఫెక్ట్.. ఆంధ్ర యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్

దీంతో గొంతు ఎండిపోయి, నొప్పి, దగ్గుతో బాధపడుతూ ఆ బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. బాలుడిని తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా..సత్వర చికిత్స చేసిన వైద్యులు బాలుడికి ప్రమాదం లేదని చెప్పడంతో తలిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ..చిన్నారుల్లో ‘రాకీ భాయ్’ వంటి సినిమా క్యారెక్టర్లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని..సమాజం పట్ల పిల్లలు విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులపై ఓ కంట కనిపెడుతూనే వారికి మంచిచెడ్డలు వివరించాలని వైద్యులు పేర్కొంటున్నారు.

other stories: KGF3: కేజీయఫ్3లో బాలీవుడ్ స్టార్ హీరో.. నెట్టింట వైరల్!

ట్రెండింగ్ వార్తలు