రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చిన సీఎం

భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మంజూరు విషయంలో నేను చేసిన వ్యాఖ్యలు.. కోర్టులను ప్రశ్నిస్తున్నాననే అర్థంలో ధ్వనించాయి. నేను చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ, నేను న్యాయ ప్రక్రియను బలంగా విశ్వసిస్తానని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నాను. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం ఉంది. భారత రాజ్యాంగం, కోర్టు తీర్పులను దృఢంగా విశ్వసించే వ్యక్తిని నేను. అదే విశ్వాసాన్ని మున్ముందు కూడా కొనసాగిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read : Hyderabad : సంపన్నుల నగరంగా హైదరాబాద్.. కుబేరుల జాబితాలో దేశంలో మూడో స్థానం మనదే..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కవితకు బెయిల్ మంజూరుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని వ్యాఖ్యానించినట్లు మీడియాలు కథనాలు వచ్చాయి. గురువారం ఓటుకు నోటు కేసుపై విచారణ సందర్భంగా పిటిషనర్ జగదీశ్ రెడ్డి తరపున ఆయన న్యాయవాది వాదనలు వినవపించారు. ఈ సందర్భంగా కవితకు బెయిల్ తీర్పుపై రేవంత్ వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

రేవంత్ వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గువాయి, జస్టిస్ కేవీ విశ్వనాథ్ లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రకటనలను పత్రికల్లో చదివాం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి.. అంటూ ప్రశ్నించారు. మేం రాజకీయ పార్టీలను సంప్రదించో.. రాజకీయాంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా? ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి అదే ప్రాతిపదిక అవుతుంది. మేము రాజకీయ పార్టీల గురించి, మా ఉత్తర్వులపై చేసే విమర్శల గురించి పట్టించుకోం.. ఆత్మప్రబోధానుసారం చేసిన ప్రమాణం ప్రకారం విధులు నిర్వర్తిస్తామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందిచారు. సుప్రీంకోర్టు తీర్పును నేను ఎక్కడా తప్పుపట్టలేదని, నాకు న్యాయవ్యవస్థపై అపార గౌరవం, విశ్వాసం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు