హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు- సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్

వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు సీఎం రేవంత్ సూచించారు.

Cm Revanth Reddy Warning : హైడ్రా పేరు చెప్పి కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు బాధితులను బెదిరిస్తున్నారని, డబ్బులు అడుగుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపైన కూడా ఫిర్యాదులు వచ్చాయన్నారు.

బెదిరింపులకు పాల్పడుతూ, డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు సీఎం రేవంత్ సూచించారు.

హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జాపై హైడ్రా సీరియస్ గా ముందుకెళ్తోంది. చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది ఇలా ఉంటే.. సందట్లో సడేమియాలా.. కొందరు అధికారులు హైడ్రా పేరుతో అక్రమాలకు తెరతీశారు. చేతి వాటానికి పాల్పడుతున్నారు. హైడ్రా పేరుతో కొందరు అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి భారీగా ఫిర్యాదులు అందాయి. గతంలో ఇచ్చిన నోటీసులను సాకుగా చూపిస్తూ డబ్బు దండుకుంటున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ సీరియస్ అయ్యారు. తక్షణమే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారందరిపై ఏసీబీ, విజిలెన్స్ ఫోకస్ చేయాలని ఆదేశించారు.

Also Read : నెక్ట్స్ టార్గెట్ ఏంటి? హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు.. నోటీసులను అడ్డు పెట్టుకుని దందాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్.. వీటన్నింటికి చెక్ పెట్టే విధంగా.. వసూళ్లకు పాల్పడుతున్న అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో నోటీసులు ఇచ్చే అధికారాన్ని హైడ్రాకు మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు