Balapur Ganesha laddu: బాలాపూర్ లడ్డూ వేలంలో రికార్డు బ్రేక్.. ఈ ఏడాది ఎంత ధర పలికింది.. ఎవరు దక్కించుకున్నారంటే..?
Balapur Ganesha laddu auction 2025 : బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాటలో రికార్డు స్థాయి ధర పలికింది.

Balapur Ganesha laddu auction 2025
Balapur Ganesha laddu auction 2025 : బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంపాటలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో కంటే ప్రస్తుతం అత్యధిక ధర పలికింది. ఈసారి మొత్తం 38మంది సభ్యులు ఈ వేలంలో పాల్గొన్నారు. గతంలో వేలంపాటల్లో లడ్డూ దక్కించుకున్న 31మందితోపాటు మరో ఏడుగురు పాల్గొన్నారు. వీరు రూ.30.01లక్షలతో పాటు రూ.500 నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేశారు. అయితే, గతేడాది (2024 సంవత్సరం) బాలాపూర్ గణపతి లడ్డూ రూ.30,01,000 పలికింది. కాగా.. ప్రస్తుతం నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ధర రూ.35లక్షలు పలికింది. లింగాల శశిథర్ గౌడ్ బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు.
Also Read: Hyderabad : హైదరాబాద్‌లో ఈ రూట్లలో ఇవాళ అస్సులు వెళ్లొద్దు.. ఇలా ప్లాన్ చేసుకోండి..
ఖైరతాబాద్ గణేశుడి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట. ఇక్కడి గణనాథుడి చేతిలో ఉండే లడ్డూ వేలం పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే బాలాపూర్ గణపతి లడ్డూను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ ఉంటుంది. 31ఏళ్లుగా ఇక్కడ లడ్డూ వేలం పాట కొనసాగుతుంది.
వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఏం చేస్తారు..?
బాలాపూర్ గణపతి లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుండటం ఇక్కడి మరో ప్రత్యేకత. ఇప్పటి వరకు రూ.1,60,87,970 ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది. ఈ ఏడాది బాలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.80వేలు ఖర్చు చేసినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. గ్రామాభివృద్ధి కోసం వినియోగించిన నిధుల వివరాలతో ఉత్సవ కమిటీ ప్లెక్సీ ఏర్పాటు చేస్తుంది. తద్వారా నిధుల వినియోగంలో పారదర్శకతను చాటుకుంటున్నారు.
ఏ సంవత్సరంలో ఎంత పలికింది? ..
♦ 1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450
♦ 1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500
♦ 1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు
♦ 1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు
♦ 1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు
♦ 1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు
♦ 2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు
♦ 2001 జీ. రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు
♦ 2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000
♦ 2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000
♦ 2004లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.2,01,000
♦ 2005లో ఇబ్రహీ శేఖర్- రూ.2,08,000
♦ 2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు
♦ 2007లో జీ రఘనాథమ్ చారి- రూ.4,15000
♦ 2008లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.5,07,000
♦ 2009లో సరిత- రూ.5,10,000
♦ 2010లో కొడాలి శ్రీదర్ బాబు- రూ.5,35,000
♦ 2011లో కొలన్ బ్రదర్స్- రూ.5,45,000
♦ 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి- రూ.7,50,000
♦ 2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000
♦ 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000
♦ 2015లో కొలన్ మధన్ మోహన్ రెడ్డి- రూ.10,32,000
♦ 2016లో స్కైలాబ్ రెడ్డి- రూ.14,65,000
♦ 2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు
♦ 2018లో తేరేటి శ్రీనివాస్ గుప్తా- రూ.16,60,000
♦ 2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు
♦ 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు
♦ 2021లో మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు
♦ 2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000
♦ 2023లో దాసరి దయానంద్ రెడ్డి- రూ.27 లక్షలు
♦ 2024లో కొలను శంకర్ రెడ్డి- రూ.30.01 లక్షలు
♦ 2025లో లింగాల దశరథ గౌడ్ రూ.35 లక్షలు