Hyderabad : హైదరాబాద్‌లో ఈ రూట్లలో ఇవాళ అస్సులు వెళ్లొద్దు.. ఇలా ప్లాన్ చేసుకోండి..

గణనాథుల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Hyderabad : హైదరాబాద్‌లో ఈ రూట్లలో ఇవాళ అస్సులు వెళ్లొద్దు.. ఇలా ప్లాన్ చేసుకోండి..

Ganesh Immersion 2025 Traffic Restrictions in Hyderabad

Updated On : September 6, 2025 / 11:12 AM IST

Hyderabad : గణనాథుల నిమజ్జనోత్సవాల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6వ తేదీ (శనివారం) ఉదయం 6గంటల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ (ఆదివారం) ఉదయం 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల రూట్ లో జరిగే ప్రధాన శోభాయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొననున్నారు. బాలాపూర్ నుంచి చార్మినార్ – అబిడ్స్– లిబర్టీ – ట్యాంక్‌బండ్ – నెక్లెస్ రోడ్ మీదుగా ప్రధాన శోభాయాత్ర సాగుతుంది.

Also Read: Bandlaguda Laddu Auction : రికార్డులన్నీ బ్రేక్.. బండ్లగూడ‌జాగీర్‌‌లో రికార్డు స్థాయి ధర పలికిన గణపతి లడ్డూ.. బాబోయ్.. అన్నికోట్లా..!

ట్రాఫిక్‌ డైవర్షన్‌ జంక్షన్లు:

♦ ఖైరతాబాద్ పోస్టాఫీసు సర్కిల్, మింట్ కాంపౌండ్ ఎంట్రన్స్, నెక్లెస్ రోటరీ, రాజీవ్ గాంధీ విగ్రహం, రాజ్ దూత్ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఉన్నాయి.
♦ రెడ్‌మార్క్ లైన్‍లో ఇవాళ వాహలను అనుమతించరు. మింట్ కాంపౌండ్ ఎంట్రన్స్ నుంచి ఇక్బాల్ మినార్ మీదుగా వెళ్లొచ్చు.
♦ ఓల్డ్ సైఫాబాద్ వైపుగా.. నిరంకారీ జంక్షన్ చేరుకొని.. ఖైరతాబాద్ జంక్షన్ వరకు రావొచ్చు. అక్కడి నుంచి ఖైరతాబాద్ ప్లైఓవర్ పైనుంచి బయలుదేరి ఐమాక్స్ ఎదురుగా కానీ, ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరకు వాహనం పార్కు చేసుకోవచ్చు.
♦ మధ్యాహ్నం 12గంటల వరకు ఖైరతాబాద్ వినాయకుడిని హుస్సేన్ సాగర్ దగ్గరకు తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. దీంతో ఆ టైంలో వాహనాల పార్కింగ్ కూడా కష్టంగా ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు..

♦ గూగుల్ మ్యాప్స్ ద్వారా రియల్ టైం ట్రాఫిక్ అప్‌డేట్‌లను తెలుసుకునేలా పోలీసులు అవకాశం కల్పించారు.
♦ హైదరాబాద్ నగరంలో మనం ఎక్కడికి వెళ్లాలన్నా తాజాగా విధించిన ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ ద్వారా రూట్ తెలుసుకోవచ్చు.
♦ గూగుల్ మ్యాప్స్‌లో బ్లూ కలర్ రూట్లలో వెళ్లడం శ్రేయస్కరం.
♦ కొంతవరకూ ఆరెంజ్ కలర్ రూట్లలో కూడా వెళ్లొచ్చు. రెడ్ కలర్ రూట్లలో మాత్రం వెళ్లొద్దు. వెళ్తే.. యూటర్న్ తప్పకపోవచ్చు.

ఈ ప్రాంతాల్లో వెళ్లొద్దు..

ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వరకు రూట్‌లో ఓల్డ్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, అంబేద్కర్ విగ్రహం ద్వారా ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక బందోబస్తు ఉంది. బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్, లిబర్టీ ద్వారా హుస్సేన్ సాగర్ వరకు ముఖ్యరూట్ ఉంది. శనివారం ఉదయం నుంచి ఈ ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు.

పార్కింగ్ ప్రదేశాలు: ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ (Hyderabad Ganesh Immersion 2025)

ఇంకా .. 
♦ నిమజ్జనం అనంతరం లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతి
♦ సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలకు ప్రవేశం లేదు
♦ ఆర్టీసీ బస్సులు పీక్ సమయంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే
♦ అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులు – చాదర్‌ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లింపు

దాటకూడని జంక్షన్లు : ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా విమానాశ్రయం వెళ్ళేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వాడాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్–పరడైజ్ రూట్ వాడాలి. నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు ఏర్పాటు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-27852482, 8712660600, 9010203626

నోటిఫికేషన్ అమలు: సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల వరకు