Ganesh Nimajjanam : గణనాథుల నిమజ్జనం వేళ.. 600 ప్రత్యేక బస్సులు.. ఈ రూట్లలోనే.. ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ..

Ganesh Nimajjanam : గణనాథుల నిమజ్జనోత్సవాల వేళ గ్రేటర్ ఆర్టీసీ శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్‌కు చేరుకునేందుకు 600 ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

Ganesh Nimajjanam : గణనాథుల నిమజ్జనం వేళ.. 600 ప్రత్యేక బస్సులు.. ఈ రూట్లలోనే.. ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ..

Ganesh Nimajjanam Greater RTC Special Buses

Updated On : September 6, 2025 / 11:13 AM IST

Ganesh Nimajjanam Greater RTC Special Buses : హైదరాబాద్ నగరంలో గణనాథుల నిమజ్జనాల కోలాహలం నెలకొంది. పది రోజులు ప్రత్యేక పూజలు అందుకున్న గణపయ్యలు లక్షలాది భక్తుల మధ్య గంగమ్మ ఒడికి చేరుతున్నారు. అయితే, గణనాథుల నిమజ్జనోత్సవాల వేళ గ్రేటర్ ఆర్టీసీ శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్ బండ్‌కు చేరుకునేందుకు 600 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అయితే, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు శనివారం ఉదయం 8గంటల నుంచి 7వ తేదీ (ఆదివారం) ఉదయం 10గంటల వరకు నగరంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు.

Also Read: Khairatabad Ganesh Shobhayatra : ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా ట్యాంక్‌బండ్‌కు.. నిమజ్జనం ఎప్పుడంటే.. Live

సిటీ బస్సులు ఇక్కడి వరకే..
♦ మెహదీపట్నం బస్సులు : మాసబ్ ట్యాంక్ వరకు..
♦ కూకట్‌పల్లి బస్సులు : ఖైరతాబాద్పీవీ స్టాచ్యూ వరకు..
♦ సికింద్రాబాద్ బస్సులు : సీటీవో ప్లాజా, ఎస్బీహెచ్,
♦ క్లాక్ టవర్, చిలకలగూడ క్రాస్‌రోడ్ వరకు..
♦ ఉప్పల్ బస్సులు : రామంతపూర్ టీవీ స్టేషన్
♦ దిల్‌సుఖ్‌నగర్ బస్సులు : గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్ వరకు..
♦ రాజేంద్ర నగర్ బస్సులు: దానమ్మ హట్స్ వరకు.. ఇబ్రహీంపట్నం, మిథానీ బస్సులు: ఐఎస్ సదన్

బేబీ పాండ్స్ ఎక్కడెక్కడున్నాయంటే ..
బేబీ పాండ్స్: జైపాల్ రెడ్డి స్పూర్తి స్థల్, హెర్బల్ స్పైసెస్ గార్డెన్ పక్కన, సంజీవయ్య పార్క్ ఎదురుగా, ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, సైదాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, మూసారాంబాగ్, బతుకమ్మ బావి, గౌలిపుర, వైశాలి నగర్, ఐఎస్ సదన్, శివాలయం రియాసత్ నగర్, లక్ష్మణేశ్వర స్వామి ఆలయం, హమామ్ బౌలి, రజనా బావి, జంగమ్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
పోర్టబుల్ వాటర్ ట్యాంకులు..
ఎన్టీఆర్ స్టేడియం, రామ్ లీలా గ్రౌండ్, చింతల్ బస్తీ, మారేడ్ పల్లి ప్లే గ్రౌండ్, బల్దియా గ్రౌండ్, చిలకల గూడ, అమీర్ పేట్ ప్లే గ్రౌండ్, అలీ కేఫ్, అంబర్ పేట్, ఎస్బీఏ గార్డెన్, 100 ఫీట్ రోడ్, కుల్సుంపుర, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లిలో ఉన్నాయి.

 

ఎంజీబీఎస్ వెళ్లే ఇంటర్ స్టేట్, జిల్లా బస్సులు..

♦ శనివారం ఉదయం 8గంటల నుంచి 7వ తేదీ (ఆదివారం) ఉదయం 8గంటల వరకు ఇంటర్ స్టేట్, జిల్లా బస్సులు ఈ ప్రాంతాల్లో ఎంజీబీఎస్ కు వెళ్లాల్సి ఉంటుంది.
♦ రాజీవ్ నేషనల్ హైవే, ఎన్‌హెచ్ 7 నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ – వైఎంసీఏ సంగీత్ క్రాస్ రోడ్ తార్నాక -జామై ఉస్మానియా ఫ్లైఓవర్- విద్యా నగర్ టీ జంక్షన్- హిందీ మహా విద్యాలయ – ఫీవర్ హాస్పిటల్- టీవై మండలి-బర్కత్‌పుర -టూరిస్ట్ హోటల్ ♦ నింబోలి అడ్డా -చాదర్ ఘాట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
♦ బెంగళూరు నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ క్రాస్ రోడ్- చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ – ఐఎస్ సదన్ – నల్గొండ క్రాస్ రోడ్-చాదర్ ఘాట్ నుంచి వెళ్లాలి.
♦ ముంబై/ఎన్‌హెచ్ 9 నుంచి వచ్చే బస్సులు గోద్రెజ్ వై జంక్షన్- నర్సాపూర్ క్రాస్ రోడ్స్-బోయిన్‌పల్లి, -జేబీఎస్ – వైఎంసీఎ – సంగీత్ థియేటర్ తార్నాక -జామై ఉస్మానియా ప్లైఓవర్ – విద్యానగర్ టీ జంక్షన్ – హిందీ మహా విద్యాలయ – ఫీవర్ హాస్పిటల్ – టీవై మండలి – బర్కత్ పుర – టూరిస్ట్ హోటల్ – నింబోలి అడ్డా – చాదర్ ఘాట్ నుంచి వెళ్లాలి.
♦ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఉదయం 8గంటల నుంచి 7వ తేదీ (ఆదివారం) ఉదయం 10గంటల వరకు నగరంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు.