MS Dhoni, Jos Buttler : కరన్ లో ధోనీ లక్షణాలు…బట్లర్ కీలక వ్యాఖ్యలు

భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కరన్ వీరోచిత ఇన్నింగ్స్ చేశాడు. 95 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.

Sam Curran : స్యామ్ కరన్..అందరి నోళ్లలో నానుతున్నాడు. భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కరన్ వీరోచిత ఇన్నింగ్స్ చేశాడు. 95 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. నరాలు తెగే ఉత్కంఠగా జరిగిన ఈ మూడో మ్యాచ్ లో భారత్ గెలిచి..వన్డే సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్‌‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కరన్ ఇన్నింగ్స్ చూస్తే..‘గ్రేట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీ’ లక్షణాలు కనిపించాయన్నారు.

మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు 200 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి..కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలో..8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కరన్ జట్టును ముందుడి నడిపించాడు. చివరి వరకు ఇంగ్లండ్ జట్టును గెలిపించాలనే పట్టుదల అతనిలో కనిపించింది. ఇలాంటి ప్రదర్శనలు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలో చూస్తుంటామని బట్లర్ వ్యాఖ్యానించారు. మ్యాచ్ అనంతరం వర్చువల్ సమావేశంలో అతను మాట్లాడారు. ప్రస్తుతం ఏప్రిల్ 09వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతాయని, ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్న కరన్ గురించి చర్చిస్తారని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అద్భుతమైన క్రికెటర్ గా, ఫినిషర్ గా ఎంఎస్ ధోనీ అంటే ఏమిటో తమకు తెలుసని, కనుక ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో ఇలాంటివి పంచుకోవడం స్యామ్ కరన్ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంఎస్ దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుండడం తనకు ఆనందంగా ఉందన్నారు.

ఇక మ్యాచ్ పరాజయంపై స్పందించారు. రెండో వన్డేలో 43.3 ఓవర్లలో 337 పరుగులు చేసిన ఇంగ్లండ్ కు మూడో వన్డేలో 330 టార్గెట్ అంతకష్టమేమి కాదని, తాము ఆ స్కోరును చేధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ..రన్ రేట్ సమస్య అవుతుందని అనుకోలేదని, వరుసగా వికెట్లు కోల్పోవడం, సరైన భాగస్వామ్యం నెలకొల్పకపోవడంతో మ్యాచ్ ను దూరం చేసిందన్నారు. మ్యాచ్‌ ఆరంభంలో తమ బౌల్లర్లు క్రమశిక్షణగా బౌలింగ్‌ చేశారు, కానీ చివరి వరకు అది కొనసాగించలేదనే అనుకుంటున్నట్లు బట్లర్ తెలిపారు.

Read More : Sheep Thinks A Dog: కుక్కలతో పెరిగిన గొర్రెపిల్ల.. చివరికి కుక్కలా మారిపోయింది!

ట్రెండింగ్ వార్తలు