Jordar Sujatha : నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాం.. జబర్దస్త్ కమెడియన్‌తో బిగ్‌బాస్ సుజాత వివాహం..

తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సుజాత అధికారికంగా తన యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా తెలియచేసింది. సుజాత ఈ వీడియోలో.. రాకేష్ తో తన పరిచయం, రాకేష్, అతని ఫ్యామిలీ గురించి మంచిగా చెప్తూ............

Jordar Sujatha :  సినీ, టీవీ పరిశ్రమలలో చాలామంది అందులో వర్క్ చేసుకునే వాళ్లనే ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు. అలాగే కొంతమంది పెళ్లి చేసుకోకపోయినా వారు క్లోజ్ గా మూవీ అవుతుంటే వారిపై చాలా గాసిప్స్ వస్తాయి. ఇటీవల అలా జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ ఫేమ్ జోర్దార్ సుజాత మీద ఫుల్ గా గాసిప్స్ వచ్చాయి. జబర్దస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ రాకింగ్ రాకేష్ అటు టీవీ షోలతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కమెడియన్ గా నటిస్తున్నాడు.

యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టి ఓ టీవీ షోలో వార్తలతో ఫేమస్ అయి బిగ్ బాస్ వరకు వెళ్లి ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు టీవీ షోలలో పార్టిసిపేట్ చేస్తూ బిజీగా ఉంది సుజాత. వీరిద్దరూ జబర్దస్త్ లో పరిచయం అయి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా ఒకరింట్లో ఫంక్షన్స్ కి ఒకరు వెళ్లడం, రాకేష్ ఇంట్లో ఏం జరిగినా సుజాత ఉండటం, ఇద్దరి యూట్యూబ్ ఛానల్స్ లో ఇద్దరూ కనపడటం, బయట కూడా కలిసి ట్రిప్స్ కి వెళ్లడం, కలిసి ఫోటోషూట్స్ చేయడం, షోలలో కలిసి పెర్ఫార్మ్ చేయడం, ఇద్దరూ కలిసి పూజలు చేయడం.. ఇలా చేస్తుండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? డేటింగ్ చేస్తున్నారా? పెళ్లి చేసుకుంటారా? అనే గాసిప్స్ బాగా వినిపించాయి. కొన్ని ఇంటర్వ్యూలలో డైరెక్ట్ గా అడిగినా సమాధానం చెప్పలేదు.

Bunny Vasu : ఈ పాటకి రీల్ చేయండి.. పుష్ప 2 షూటింగ్ చూసే ఛాన్స్ గెలుచుకోండి..

తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సుజాత అధికారికంగా తన యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా తెలియచేసింది. సుజాత ఈ వీడియోలో.. రాకేష్ తో తన పరిచయం, రాకేష్, అతని ఫ్యామిలీ గురించి మంచిగా చెప్తూ, స్నేహతులుగా మొదలైన మా ప్రయాణం ఒకర్నొకరు అర్ధం చేసుకొని పెళ్లి దాకా వెళ్తున్నాం అని, రాకేష్ తనకి అన్ని విధాలుగా లైఫ్ లో సపోర్ట్ గా నిలిచాడని, మా ఇంట్లో వాళ్ళు కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నారని, ఈ నెల చివర్లో నిశ్చితార్థం చేసుకుంటామని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మా జంటని మీరంతా ఆశీర్వదించాలని కోరింది. దీంతో టీవీ సెలబ్రిటీలు, పలువురు నెటిజన్లు వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు